Telugu Global
Cinema & Entertainment

కమల్ హాసన్ ప్లేస్ కొట్టేసిన రానా

మన హీరో రానా, కమల్ హాసన్ స్థాయికి వెళ్లిపోయాడా.. నటనలో కమల్ స్థానాన్నే ఆక్రమించాడు. కచ్చితంగా కాదనే సమాధానం వస్తుంది. ఈ విషయాన్ని రానా కూడా ఒప్పుకుంటాడు. కానీ ఒక విషయంలో మాత్రం కమల్ హాసన్ స్థానాన్ని ఆక్రమించాడు రానా. దర్శకుడు బాల చలవతో ఈ ఘనత సాధించాడు రానా. కుట్ర పరంబరాయ్ అనే వివాదాస్పద తమిళ రచనకు దృశ్యరూపం ఇవ్వడానికి సిద్ధమౌతున్నాడు దర్శకుడు బాల. ఈ నవల సారాంశాన్ని కమల్ కు వివరించాడు. సినిమాలో నటించాల్సిందిగా […]

కమల్ హాసన్ ప్లేస్ కొట్టేసిన రానా
X
మన హీరో రానా, కమల్ హాసన్ స్థాయికి వెళ్లిపోయాడా.. నటనలో కమల్ స్థానాన్నే ఆక్రమించాడు. కచ్చితంగా కాదనే సమాధానం వస్తుంది. ఈ విషయాన్ని రానా కూడా ఒప్పుకుంటాడు. కానీ ఒక విషయంలో మాత్రం కమల్ హాసన్ స్థానాన్ని ఆక్రమించాడు రానా. దర్శకుడు బాల చలవతో ఈ ఘనత సాధించాడు రానా. కుట్ర పరంబరాయ్ అనే వివాదాస్పద తమిళ రచనకు దృశ్యరూపం ఇవ్వడానికి సిద్ధమౌతున్నాడు దర్శకుడు బాల. ఈ నవల సారాంశాన్ని కమల్ కు వివరించాడు. సినిమాలో నటించాల్సిందిగా కోరాడు. కానీ పైకి చెప్పలేని కొన్ని కారణాల వల్ల సినిమాలో నటించడానికి కమల్ ఒప్పుకోలేదు. దీంతో కమల్ కోసం అనుకున్న ఆ పాత్రను రానాకు ఇచ్చాడట బాల. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రానా ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. బాల దర్శకత్వంలో నటించడమే ఓ గొప్ప అనుకుంటే.. కమల్ కోసం అనుకున్న పాత్రను తనకు ఇవ్వడం ఇంకా గౌరవంగా భావిస్తున్నాడు. స్వాతంత్రానికి ముందు జరిగిన ఓ యదార్థ సంఘటనతో ఈ సినిమా రాబోతోంది. మూవీలో రానాతో పాటు ఆర్య, విశాల్, అరవింద్ స్వామి కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ప్రెస్ నోట్ రానుంది.
Next Story