Telugu Global
Cinema & Entertainment

దేవుడి పాట పూర్తిచేసిన బాలయ్య

డిక్టేటర్ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు నటసింహం. తాజాగా ఈ సినిమాకు సంబధించి గం..గం..గణేష అనే దేవుడి పాట షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. మొన్న జరిగిన వినాయక చవితి సందర్భంగా ఈ ఆడియో సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పుడీ పాట పిక్చరైజేషన్ ను భారీస్థాయిలో జరిపారు. కేవలం ఈ ఒక్కపాట కోసమే కోటి రూపాయలు ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. తాజాగా పాట షూటింగ్ కంప్లీట్ అయిన విషయాన్ని దర్శకుడు శ్రీవాస్ ప్రకటించాడు. బాలయ్య ఎనర్జీకి […]

దేవుడి పాట పూర్తిచేసిన బాలయ్య
X
డిక్టేటర్ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు నటసింహం. తాజాగా ఈ సినిమాకు సంబధించి గం..గం..గణేష అనే దేవుడి పాట షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. మొన్న జరిగిన వినాయక చవితి సందర్భంగా ఈ ఆడియో సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పుడీ పాట పిక్చరైజేషన్ ను భారీస్థాయిలో జరిపారు. కేవలం ఈ ఒక్కపాట కోసమే కోటి రూపాయలు ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. తాజాగా పాట షూటింగ్ కంప్లీట్ అయిన విషయాన్ని దర్శకుడు శ్రీవాస్ ప్రకటించాడు. బాలయ్య ఎనర్జీకి హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు.
ఈనెల 23 నుంచి డిక్టేటర్ టీం ఢిల్లీలో షూటింగ్ చేస్తుంది. దేశరాజధానిలో వారం రోజుల పాటు షూటింగ్ ఉంటుంది. ఈ షూటింగ్ తో సినిమా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. తిరిగి హైదరాబాద్ వచ్చి ప్యాచ్ వర్క్ పూర్తిచేస్తారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల్ని.. వచ్చేనెల 20న ఏపీ నూతన రాజధాని అమరావతిలో విడుదల చేస్తారు. మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
First Published:  17 Nov 2015 7:02 PM GMT
Next Story