Telugu Global
NEWS

మేయర్ భర్త కూడా మృతి

చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన మేయర్ అనురాధ భర్త మోహన్ కూడా చనిపోయారు. వేలూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మోహన్‌ను రక్షించేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దుండగులు మోహన్‌ మెడపై కత్తులతో గట్టిగా నరకడంతో  నరాలు తెగిపోయాయి. దీంతో ప్రాణాలు కాపాడడం కష్టమైందని వైద్యులు చెబుతున్నారు.  బురఖా ధరించి వచ్చిన దుండగులు చిత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయంలోనే మేయర్ అనూరాధ దంపతులపై తుపాకులు, కత్తులతో దాడి చేశారు. […]

మేయర్ భర్త కూడా మృతి
X

చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన మేయర్ అనురాధ భర్త మోహన్ కూడా చనిపోయారు. వేలూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మోహన్‌ను రక్షించేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దుండగులు మోహన్‌ మెడపై కత్తులతో గట్టిగా నరకడంతో నరాలు తెగిపోయాయి. దీంతో ప్రాణాలు కాపాడడం కష్టమైందని వైద్యులు చెబుతున్నారు. బురఖా ధరించి వచ్చిన దుండగులు చిత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయంలోనే మేయర్ అనూరాధ దంపతులపై తుపాకులు, కత్తులతో దాడి చేశారు. దాడిలో అనురాధ అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన మోహన్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన కూడా తుదిశ్వాస విడిచారు.

First Published:  17 Nov 2015 11:37 AM GMT
Next Story