Telugu Global
Others

ప్లాన్‌ A,B రెండింటిని ప్రయోగించిన హంతకులు

చిత్తూరు టీడీపీ మేయర్ అనురాధ దంపతులను ఎట్టి పరిస్థితుల్లోనూ హత్య చేసి తీరాలన్న గట్టి నిర్ణయంతో హంతకులు వచ్చినట్టు అర్థమవుతోంది. దాడి జరిగిన తీరు చూస్తుంటే హంతకులు రెండు ప్లాన్‌లతో సిద్ధమై వచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్లాన్ ఏ, ప్లాన్ బీతో దాడికి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.  తుపాకులతో కాల్చి చంపడం ప్లాన్ ఏ,  పరిస్థితులు అనుకూలిస్తే కత్తులతో నరికి చంపాలన్నది ప్లాన్ బి. అయితే ఈ రెండు ప్లాన్లను దుండగులను ప్రయోగించేశారు. పథకాన్ని అమలు చెయ్యడానికి కార్పోరేషన్ కార్యాలయానికి […]

ప్లాన్‌ A,B రెండింటిని ప్రయోగించిన హంతకులు
X

చిత్తూరు టీడీపీ మేయర్ అనురాధ దంపతులను ఎట్టి పరిస్థితుల్లోనూ హత్య చేసి తీరాలన్న గట్టి నిర్ణయంతో హంతకులు వచ్చినట్టు అర్థమవుతోంది. దాడి జరిగిన తీరు చూస్తుంటే హంతకులు రెండు ప్లాన్‌లతో సిద్ధమై వచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్లాన్ ఏ, ప్లాన్ బీతో దాడికి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. తుపాకులతో కాల్చి చంపడం ప్లాన్ ఏ, పరిస్థితులు అనుకూలిస్తే కత్తులతో నరికి చంపాలన్నది ప్లాన్ బి. అయితే ఈ రెండు ప్లాన్లను దుండగులను ప్రయోగించేశారు.

పథకాన్ని అమలు చెయ్యడానికి కార్పోరేషన్ కార్యాలయానికి ఉదయం హంతకులు టీంగా వచ్చారు. వారిలో ఇద్దరు వద్ద పాయింట్ 32 గన్స్ ఉన్నాయి. మిగిలిన వారి వద్ద కత్తులు ఉన్నాయి. అనుమానం రాకుండా బురఖాలు ధరించి, బొకేలతో మేయర్ చాంబర్‌లోని ప్రవేశించారు. వచ్చీ రాగానే మేయర్ దంపతులపై తుపాకులు ఎక్కుపెట్టారు. హంతకుల చేతి వాటానికి అనువైన వైపు ఉండడంతో అనురాధను సులువగా కాల్చి చంపేశారు. ఆమె భర్త కాస్త దూరంగా ఉండడంతో గాయాలతో బయటపడ్డారు.

అక్కడే మేయర్ వర్గీయులు ఉండడంతో తిరగబడుతారని దుండుగలు భావించారు. అందుకే వారిని కూడా భయభ్రాంతులను చేసేందుకు కత్తులు కూడా బయటకు తీశారు. మోహన్‌పై కత్తులతో విరుచుకుపడ్డారు. ఈ భయానక దృశ్యాలను చూసి అక్కడున్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీంతో ప్లాన్ పూర్తి చేసి దుండగులు గోడ దూకి పారిపోయారు.

Also Read: అనురాధ హత్య- ముందే కూసిన కోయిల!

First Published:  17 Nov 2015 9:20 AM GMT
Next Story