Telugu Global
NEWS

చంద్రబాబు పసుపుపచ్చ ఆలోచన

ఇప్పటికే ఏపీలో చాలా పథకాలకు తన సొంతపేరు పెట్టుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు రేషన్ కార్డులపై దృష్టి పెట్టారు.  అయితే రేషన్ కార్డులపై తనపేరు పెట్టుకోవడం లేదు గానీ.. కార్డుల కలర్‌పై బాబు కన్నేశారు. తెల్ల రేషన్ కార్డులపై సొంత రంగు పూసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.  తనపార్టీ కలర్ అయిన పసుపు రంగులోకి తెల్లరేషన్ కార్డులను మార్చే యోచన చేస్తున్నారు.  సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చాలా సేపు చర్చించారు. ఇకపై తెల్లరేషన్ కార్డుల […]

చంద్రబాబు పసుపుపచ్చ ఆలోచన
X

ఇప్పటికే ఏపీలో చాలా పథకాలకు తన సొంతపేరు పెట్టుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు రేషన్ కార్డులపై దృష్టి పెట్టారు. అయితే రేషన్ కార్డులపై తనపేరు పెట్టుకోవడం లేదు గానీ.. కార్డుల కలర్‌పై బాబు కన్నేశారు. తెల్ల రేషన్ కార్డులపై సొంత రంగు పూసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తనపార్టీ కలర్ అయిన పసుపు రంగులోకి తెల్లరేషన్ కార్డులను మార్చే యోచన చేస్తున్నారు. సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చాలా సేపు చర్చించారు. ఇకపై తెల్లరేషన్ కార్డుల స్థానంలో పసుపు రంగు కార్డులను పంచే అంశంపై మంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు . దీనిపై ప్రజల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంటుందన్న దానిపై సమాలోచనలు చేశారు. ప్రజలకు అడుగడుగున టీడీపీ రంగు గుర్తు చేసే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేస్తున్నారని భావిస్తున్నారు.

First Published:  16 Nov 2015 8:56 PM GMT
Next Story