Telugu Global
Cinema & Entertainment

అఖిల్ కోలీవుడ్ ఎంట్రీ లేనట్టే

తన ఫస్ట్ మూవీతో కోలీవుడ్ లో కూడా హల్ చల్ చేద్దామనుకున్నాడు అఖిల్. కానీ తాజా పరిస్థితుల కారణంగా ఆ సినిమాను తమిళనాట విడుదల చేయకపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు మేకర్స్. దీంతో అఖిల్ సినిమా తమిళ వెర్షన్ విడుదలయ్యే అవకాశమే కనిపించడం లేదు. ఈ సినిమా తమిళ వెర్షన్ హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న సి.కల్యాణ్.. మరిన్ని నష్టాలు రాకుండా ఉండాలంటే సినిమాను డబ్బాల్లో ఉంచేయడమే బెటరని భావించాడు. నిజానికి అఖిల్ మూవీని ఒకేసారి తెలుగు-తమిళ […]

అఖిల్ కోలీవుడ్ ఎంట్రీ లేనట్టే
X
తన ఫస్ట్ మూవీతో కోలీవుడ్ లో కూడా హల్ చల్ చేద్దామనుకున్నాడు అఖిల్. కానీ తాజా పరిస్థితుల కారణంగా ఆ సినిమాను తమిళనాట విడుదల చేయకపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు మేకర్స్. దీంతో అఖిల్ సినిమా తమిళ వెర్షన్ విడుదలయ్యే అవకాశమే కనిపించడం లేదు. ఈ సినిమా తమిళ వెర్షన్ హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న సి.కల్యాణ్.. మరిన్ని నష్టాలు రాకుండా ఉండాలంటే సినిమాను డబ్బాల్లో ఉంచేయడమే బెటరని భావించాడు.
నిజానికి అఖిల్ మూవీని ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. తమిళ్ లో ఈ సినిమాకు సూర్య కవచం అనే పేరుపెట్టారు. ట్రయిలర్ ను కూడా విడుదల చేశారు. కానీ కమల్ నటించిన చీకటిరాజ్యం, అజిత్ చేసిన వేదాలమ్ సినిమాలు రేసులో ఉండడంతో.. దీపావళి సీజన్ నుంచి అఖిల్ ను తప్పించారు. ఈ గ్యాప్ లో తెలుగులో ఆ సినిమా విడుదలవ్వడం, అట్టర్ ఫ్లాప్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇంతటి బ్యాడ్ టాక్ తో తమిళ్ లో సినిమాను విడుదల చేయడం మంచిది కాదని భావించి డ్రాప్ అయినట్టు సమాచారం.
First Published:  16 Nov 2015 7:04 PM GMT
Next Story