Telugu Global
Cinema & Entertainment

ఇండియాలో టైటానిక్‌ హీరో రహస్య పర్యటన

టైటానిక్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు హీరో లియోనార్డో డికాప్రియో. ఇండియాలో కూడా ఈ హీరోను చాలామంది సినీ అభిమానులు గుర్తుపడతారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో చాలామంది భామలకు డికాప్రియా అంటే చాలా ఇష్టం. కరీనా కపూర్ నుంచి సోనమ్ కపూర్ వరకు ఎంతోమంది భామలకు లియోనార్డో కలల రాకుమారుడు. అలాంటి వరల్డ్ ఫేమస్ హీరో అత్యంత రహస్యంగా ఇండియాలో ప్రవేశించాడు. సీక్రెట్ గా తన పని తాను చేసుకోపోయాడు. ఇంతకీ భారత్ లో డికాప్రియో ఏం […]

ఇండియాలో టైటానిక్‌ హీరో రహస్య పర్యటన
X
టైటానిక్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు హీరో లియోనార్డో డికాప్రియో. ఇండియాలో కూడా ఈ హీరోను చాలామంది సినీ అభిమానులు గుర్తుపడతారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో చాలామంది భామలకు డికాప్రియా అంటే చాలా ఇష్టం. కరీనా కపూర్ నుంచి సోనమ్ కపూర్ వరకు ఎంతోమంది భామలకు లియోనార్డో కలల రాకుమారుడు. అలాంటి వరల్డ్ ఫేమస్ హీరో అత్యంత రహస్యంగా ఇండియాలో ప్రవేశించాడు. సీక్రెట్ గా తన పని తాను చేసుకోపోయాడు. ఇంతకీ భారత్ లో డికాప్రియో ఏం చేశాడు..
ఓ డాక్యుమెంటరీలో నటించేందుకు ఇండియా వచ్చాడు లియోనార్డో. వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలతో తెరకెక్కుతున్న ఆ డాక్యుమెంటరీని తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ షూటింగ్ కోసం ఇండియా వచ్చాడు లియానోర్డో. ఇతడితో పాటు ఓ ఇండియన్ గైడ్ కూడా ఉన్నాడు. ఏకంగా 4 రోజుల పాటు ఇండియాలోని వివిధ లొకేషన్లలో షూటింగ్ చేశారు. మొత్తం పర్యటన వివరాల్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. కేవలం సెక్యూరిటీ రీజన్స్ కారణంగానే ప్రభుత్వం ఈ పని చేసింది. దీంతో ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా.. హడావుడి చేయకుండా తిరిగి వెళ్లిపోయాడు టైటానిక్ హీరో.
Next Story