Telugu Global
Cinema & Entertainment

ఈసారి రానా ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు

బాహుబలి సినిమా విడుదలైనప్పడు దగ్గుబాటి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎందుకంటే సినిమాలో హీరో ప్రభాస్ కంటే రానానే ఎక్కువగా హైలెట్ అయ్యాడు. విలనిజాన్ని పీక్ స్టేజ్ లో చూపించే రాజమౌళి, రానాను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. మరీ ముఖ్యంగా రానాకు బాలీవుడ్ టచ్ ఉండడం కూడా బాగా కలిసొచ్చింది. బాలీవుడ్ లో బాహుబలి విడుదల సందర్భంగా హిందీ మీడియా అంతా రానానే ఫోకస్ చేసింది. అలా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు రానా. అయితే ఈసారి ఆ పొడుగాటి […]

ఈసారి రానా ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు
X
బాహుబలి సినిమా విడుదలైనప్పడు దగ్గుబాటి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎందుకంటే సినిమాలో హీరో ప్రభాస్ కంటే రానానే ఎక్కువగా హైలెట్ అయ్యాడు. విలనిజాన్ని పీక్ స్టేజ్ లో చూపించే రాజమౌళి, రానాను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. మరీ ముఖ్యంగా రానాకు బాలీవుడ్ టచ్ ఉండడం కూడా బాగా కలిసొచ్చింది. బాలీవుడ్ లో బాహుబలి విడుదల సందర్భంగా హిందీ మీడియా అంతా రానానే ఫోకస్ చేసింది. అలా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు రానా. అయితే ఈసారి ఆ పొడుగాటి హీరోకు అంత సీన్ లేదని తెలుస్తోంది. దగ్గుబాటి ఫ్యాన్స్ కు ఇది నిరాశకలిగించే వార్తే.
బాహుబలి-2 సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే మొత్తం పూర్తయింది. వచ్చేనెల నుంచి సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ రెండో భాగంలో రానా ఎఫెక్ట్ పెద్దగా ఉండదని సమాచారం. కథ ప్రకారం మొత్తం డామినేషన్ అంతా ప్రభాస్ దే. సో.. ఈసారి రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. కథను ముగించాలి కాబట్టి.. బాహుబలి-2లో శివుడు, బాహుబలి పాత్రలు రెండింటినీ ఎలివేట్ చేయాల్సి ఉంది. మాహిష్మతి సామ్రాజ్యాన్ని శివుడు ఎలా దక్కించుకున్నాడనే అంశంతో పాటు.. బాహుబలి ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పాలి. కాబట్టి పార్ట్-2లో అంతా ప్రభాస్ షోనే నడుస్తోంది. రానా మెరుపులు కాస్త తగ్గనున్నాయి.
Next Story