Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్‌నే ఏడిపిస్తున్న ఆ ఇద్దరు ద‌క్షిణాది ద‌ర్శకులెవ‌రు?

ఏ మాట‌కి ఆ మాట చెప్పుకోవాలే గానీ బాలీవుడ్‌కంటే ఘ‌న‌చిత్రాలు, చిత్రరాజాలు, క్లాసిక‌ల్ చిత్రాలు మ‌న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఉన్నాయి. ద‌క్షిణాది చిత్రాల కంటే మంచి చిత్రాలు రూపొందించాల‌ని బాలీవుడ్ డైరెక్టర్లు పోటీలు పెట్టుకుంటుంటారు. అయితే ద‌క్షిణాది లోని  ఓ ఇద్దరు ద‌ర్శకులు మాత్రం త‌మ ప‌నితో బాలీవుడ్‌నే ఏడిపిస్తుంటారు. వారెవ‌రో కాదు మ‌న ఎస్‌.ఎస్‌. రాజమౌళి, త‌మిళ డైరెక్టర్ శంక‌ర్‌. అవును మ‌రి ఈగ‌, బాహుబ‌లి  లాంటి విజువ‌ల్ వండ‌ర్స్ చూసి బాలీవుడ్ ముక్కున […]

బాలీవుడ్‌నే ఏడిపిస్తున్న ఆ ఇద్దరు ద‌క్షిణాది ద‌ర్శకులెవ‌రు?
X

ఏ మాట‌కి ఆ మాట చెప్పుకోవాలే గానీ బాలీవుడ్‌కంటే ఘ‌న‌చిత్రాలు, చిత్రరాజాలు, క్లాసిక‌ల్ చిత్రాలు మ‌న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఉన్నాయి. ద‌క్షిణాది చిత్రాల కంటే మంచి చిత్రాలు రూపొందించాల‌ని బాలీవుడ్ డైరెక్టర్లు పోటీలు పెట్టుకుంటుంటారు. అయితే ద‌క్షిణాది లోని ఓ ఇద్దరు ద‌ర్శకులు మాత్రం త‌మ ప‌నితో బాలీవుడ్‌నే ఏడిపిస్తుంటారు. వారెవ‌రో కాదు మ‌న ఎస్‌.ఎస్‌. రాజమౌళి, త‌మిళ డైరెక్టర్ శంక‌ర్‌. అవును మ‌రి ఈగ‌, బాహుబ‌లి లాంటి విజువ‌ల్ వండ‌ర్స్ చూసి బాలీవుడ్ ముక్కున వేలేసుకుంది. ఇలాంటి అద్భుత‌మైన గ్రాఫిక్స్ మూవీని చూసి ధ‌ర్మప్రొడ‌క్షన్ అధినేత క‌ర‌ణ్ జోహార్ మ‌న‌సుప‌డి మ‌రీ బాహుబ‌లిని హిందీలో విడుద‌ల చేశాడు. బాహుబ‌లి సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో అని బాలీవుడ్ ఈగర్లీ వెయిటింగ్‌.

ఇక త‌మిళ ద‌ర్శకుడు శంక‌ర్ అయితే త‌న తొలి మూవీ జెంటిల్‌మ‌న్‌ ద‌గ్గరి నుంచి బాలీవుడ్ ను బెంబేలెత్తిస్తున్నాడు. జీన్స్ చిత్రం నుంచి గ్రాఫిక్స్‌తో మాయాజాలం చేస్తున్నాడు. రోబో చిత్రంతో బాలీవుడ్‌కు స‌వాలు విసిరాడు శంక‌ర్‌. ఆయ‌న తెర‌కెక్కించిన గ‌త చిత్రం ఐ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో ఈ సారి శంక‌ర్ క‌సిగా ఉన్నాడు. అందుకే ఆయ‌న ఈ సారి తాను రూపొందించ‌నున్న రోబో సీక్వెల్‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ ట‌చ్ ఇస్తున్నాడు. శంక‌ర్ త‌న లాస్ట్ మూవీ ఐ ఆడియో వేడుక‌కు ఏరికోరి హాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ‌ర్ ను ఆహ్వానించాడు. ఆయ‌నే రోబో సీక్వెల్‌కు విల‌న్‌. ఆర్నాల్డ్ పారితోషికం దాదాపు వంద‌కోట్ల దాకా ఉంద‌ని కోలీవుడ్ గుస‌గుస‌. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మ‌వ‌నున్న రోబో 2 దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌త‌క్ష రూపొంద‌నుంది. దీంతో ఈ సారి శంక‌ర్ రోబో ఎలా విరుచుకుప‌డుతుందా అని బాలీవుడ్ చిత్రలోకం ఆలోచిస్తోంది. బాలీవుడ్‌లో కూడా విజువ‌ల్ ప్రాధాన్యమున్న చిత్రాలు వ‌స్తున్నాయి. కాక‌పోతే ద‌క్షిణాది అంత కాదు. ఇక్కడ అద్భుత‌మైన సాంకేతిక నిపుణులు ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఏదేమైనా రాజ‌మౌళి, శంక‌ర్ ఒక మంచి ఆరోగ్యక‌ర‌మైన వాతావ‌ర‌ణంలో వ‌ర్క్ చేస్తూ చ‌క్కటి చిత్రాల‌తో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు.

Next Story