Telugu Global
NEWS

నేడు వరంగల్ ప్రచారానికి జగన్

వరంగల్‌ ఉప ఎన్నికల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. ఇవాళ్టి నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాలుగు రోజులపాటు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పాలకుర్తి నుంచి జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. చివరి రోజు హన్మకొండలో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరుఫున వైసీపీ ఎమ్మెల్యే రోజాతోపాటు తెలంగాణ వైసీపీ […]

నేడు వరంగల్ ప్రచారానికి జగన్
X

వరంగల్‌ ఉప ఎన్నికల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. ఇవాళ్టి నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాలుగు రోజులపాటు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పాలకుర్తి నుంచి జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. చివరి రోజు హన్మకొండలో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఇప్పటికే వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరుఫున వైసీపీ ఎమ్మెల్యే రోజాతోపాటు తెలంగాణ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు అధినేత జగన్ కూడా ప్రచారానికి రానుండడంతో కార్యకర్తల్లో కొంత ఉత్సాహం పెరిగింది. పోటీ అయితే చేస్తున్నారు కాని ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి గెలవడం దుస్సాధ్యం.

First Published:  16 Nov 2015 12:42 AM GMT
Next Story