Telugu Global
Cinema & Entertainment

రవితేజ తగ్గినప్పటికీ అఖిల్ కు ఒరిగేదేం లేదు

అఖిల్ సినిమాకు సంబంధించి ఇప్పటికే నెగెటివ్ టాక్ పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది. ఇన్నాళ్లూ కాస్త ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు సైతం ఇప్పుడు ఆ సినిమాను లైట్ తీసుకున్నారు. దీంతో అఖిల్ సినిమా ప్రస్తుతం నష్టాల్లో థియేటర్లలో నడుస్తోంది. రిలీజ్ కు ముందు సినిమా చేసిన బిజినెస్ లో కనీసం సగం కూడా ఇప్పుడు వసూళ్ల రూపంలో రావట్లేదు. కనీసం తొలి వీకెండ్ లో అయినా అఖిల్ ఆడేస్తుందని అనుకుంటే అది కూడా జరగలేదు. శని, ఆదివారాల్లో కూడా అఖిల్ […]

రవితేజ తగ్గినప్పటికీ అఖిల్ కు ఒరిగేదేం లేదు
X
అఖిల్ సినిమాకు సంబంధించి ఇప్పటికే నెగెటివ్ టాక్ పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది. ఇన్నాళ్లూ కాస్త ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు సైతం ఇప్పుడు ఆ సినిమాను లైట్ తీసుకున్నారు. దీంతో అఖిల్ సినిమా ప్రస్తుతం నష్టాల్లో థియేటర్లలో నడుస్తోంది. రిలీజ్ కు ముందు సినిమా చేసిన బిజినెస్ లో కనీసం సగం కూడా ఇప్పుడు వసూళ్ల రూపంలో రావట్లేదు. కనీసం తొలి వీకెండ్ లో అయినా అఖిల్ ఆడేస్తుందని అనుకుంటే అది కూడా జరగలేదు. శని, ఆదివారాల్లో కూడా అఖిల్ మొహం చూడలేదు జనాలు. ఈ నేపథ్యంలో రవితేజ తప్పుకున్నప్పటికీ.. అఖిల్ కు కలిసొచ్చేదేం ఉండదని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
నిజానికి ఈనెల 27న రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాను డిసెంబర్ 10కి వాయిదా వేశారు. రవితేజ సినిమా వాయిదా పడితే అఖిల్ మూవీకి కాస్త కలిసొస్తుందని అంతా అంచనా వేశారు. కానీ తొలి వీకెండ్ పరిస్థితి చూశాక.. అఖిల్ సినిమా ఈనెల 27 వరకు కూడా థియేటర్లలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బెంగాల్ టైగర్ సినిమా వాయిదా పడినా, అఖిల్ కు ఒరిగేదేం లేకుండా పోయింది. ఈ గ్యాప్ లో కావాలంటే ఇప్పటివరకు విడుదలకాని చిన్న సినిమాల్ని థియేటర్లలోకి తీసుకొస్తే బెటర్.
First Published:  15 Nov 2015 7:02 PM GMT
Next Story