Telugu Global
Cinema & Entertainment

స్టార్ హీరోకి ఒళ్ళు నెప్పులు ఎందుకొచ్చాయి?

కొంతమందికి పేరు ఊరికే రాదు. అందుకోసం వారు చేసిన కఠోర దీక్ష, పడిన శ్రమ చాలా ఎక్కువే ఉంటుంది. అలాంటివారిలో మొదటి వరుసలో ఉండే స్టార్ హీరో, బాలివుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. అందుకే అతడిని మిష్టర్ పర్ఫెక్షనిష్ట్  అంటారు అందరూ. అందుకు తగ్గట్లు తన తన పాత్రలలో ఒదిగిపోయేలా శారీరిక మార్పులు, మానసిక సంసిద్ధత కోసం అనేకం కష్ట పడడం మనకు తెలుసు కదా! తన రాబోయే హిందీ సినిమా ‘డంగల్ ‘ కోసం బాగా […]

స్టార్ హీరోకి ఒళ్ళు నెప్పులు ఎందుకొచ్చాయి?
X

కొంతమందికి పేరు ఊరికే రాదు. అందుకోసం వారు చేసిన కఠోర దీక్ష, పడిన శ్రమ చాలా ఎక్కువే ఉంటుంది. అలాంటివారిలో మొదటి వరుసలో ఉండే స్టార్ హీరో, బాలివుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. అందుకే అతడిని మిష్టర్ పర్ఫెక్షనిష్ట్ అంటారు అందరూ. అందుకు తగ్గట్లు తన తన పాత్రలలో ఒదిగిపోయేలా శారీరిక మార్పులు, మానసిక సంసిద్ధత కోసం అనేకం కష్ట పడడం మనకు తెలుసు కదా! తన రాబోయే హిందీ సినిమా ‘డంగల్ ‘ కోసం బాగా బరువు పెంచేసాడు. అందులో ఆమిర్ మధ్య వయస్సు వస్తాదు మహావీర్ పోగట్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్ర కోసం విపరీతంగా వర్క్అవుట్స్ చెయ్యడం… గంటల తరబడి రెస్ట్లింగ్ ప్రాక్టిస్ చేస్తూ షూటింగ్ చెయ్యడం వలన మజిల్ క్రాంప్స్ డెవలప్ అయ్యి, ఒళ్ళు నెప్పులు బాగా వచ్చాయట. ముఖ్యంగా పిక్కలలో, వీపు బాగం నెప్పులతో బాగా ఇబ్బంది పెడుతుంటే…. కొన్ని రోజుల రెస్ట్ తీసుకుని షూటింగ్ కంటిన్యూ చేస్తాడని టాక్. ప్రస్తుతం పంజాబ్‌లోని లుధియానాలో షూటింగ్ చేస్తున్నారు ఆమిర్ & కో.

Next Story