Telugu Global
Cinema & Entertainment

రాధాకృష్ణతో వెంకీకి పనేంటి..?

రాధాకృష్ణ పేరుచెప్పగానే అందరికీ ఆంధ్రజ్యోతి ఎండీనే గుర్తొస్తాడు. ఆ వ్యక్తికి, సినీనటుడు వెంకటేష్ కు అస్సలు సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఆ పేరును విచ్చలవిడిగా వాడుకోవడానికి సిద్ధమయ్యాడు వెంకటేశ్. అవును.. వెంకీ తాజా చిత్రం పేరు రాధాకృష్ణ, మారుతి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు మొదట్లో రాధ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ పేరు మార్చి తాజాగా రాధాకృష్ణ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిజజీవితంలో రాధాకృష్ణ మీడియాకు సంబంధించిన […]

రాధాకృష్ణతో వెంకీకి పనేంటి..?
X
రాధాకృష్ణ పేరుచెప్పగానే అందరికీ ఆంధ్రజ్యోతి ఎండీనే గుర్తొస్తాడు. ఆ వ్యక్తికి, సినీనటుడు వెంకటేష్ కు అస్సలు సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఆ పేరును విచ్చలవిడిగా వాడుకోవడానికి సిద్ధమయ్యాడు వెంకటేశ్. అవును.. వెంకీ తాజా చిత్రం పేరు రాధాకృష్ణ, మారుతి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు మొదట్లో రాధ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ పేరు మార్చి తాజాగా రాధాకృష్ణ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిజజీవితంలో రాధాకృష్ణ మీడియాకు సంబంధించిన వ్యక్తిగా మనకు తెలిసిందే. కానీ రాధాకృష్ణ సినిమాలో మాత్రం వెంకీ హోంమినిస్టర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలకానుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను ఫిక్స్ చేశారు. చాన్నాళ్లుగా ఈ పేరు వినిపిస్తున్నప్పటికీ.. తాజాగా ఆమె కాల్షీట్లు సంపాదించినట్టు తెలుస్తోంది. వెంకీ-నయన్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఈ రాధాకృష్ణ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కు చెందిన పిల్ల సంస్థ, సితార మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ సెట్స్ పైకి రానుంది.
First Published:  14 Nov 2015 7:02 PM GMT
Next Story