Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్యకు శృతిహాసన్ క్లాస్

యంగ్ హీరో నాగచైతన్యకు త్వరలోనే క్లాస్ పీకనుంది శృతిహాసన్. ఇద్దరి మధ్య గొడవలేం లేవు. కానీ చైతూ కూడా క్లాస్ పీకించుకోవడానికి సిద్ధమౌతున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ప్రేమమ్ సినిమా కోసం ఇదంతా జరగబోతోంది. మజ్నూగా తెరకెక్కనున్న ప్రేమమ్ రీమేక్ లో నటించడానికి ఒప్పుకుంది శృతిహాసన్. ఈ సినిమాలో నాగచైతన్యకు పాఠాలు చెప్పే క్లాస్ టీచర్ గా శృతిహాసన్ కనిపించనుంది. ఈ పాత్ర పేరు సాయి పల్లవి. ఈ క్యారెక్టర్ కోసం స్పెషల్ గా మేకోవర్ […]

నాగచైతన్యకు శృతిహాసన్ క్లాస్
X
యంగ్ హీరో నాగచైతన్యకు త్వరలోనే క్లాస్ పీకనుంది శృతిహాసన్. ఇద్దరి మధ్య గొడవలేం లేవు. కానీ చైతూ కూడా క్లాస్ పీకించుకోవడానికి సిద్ధమౌతున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ప్రేమమ్ సినిమా కోసం ఇదంతా జరగబోతోంది. మజ్నూగా తెరకెక్కనున్న ప్రేమమ్ రీమేక్ లో నటించడానికి ఒప్పుకుంది శృతిహాసన్. ఈ సినిమాలో నాగచైతన్యకు పాఠాలు చెప్పే క్లాస్ టీచర్ గా శృతిహాసన్ కనిపించనుంది. ఈ పాత్ర పేరు సాయి పల్లవి. ఈ క్యారెక్టర్ కోసం స్పెషల్ గా మేకోవర్ కానుంది శృతిహాసన్. సినిమాలో మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మూడో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. ఈనెల 30న ఈ సినిమా ప్రారంభం అవుతుంది.. వచ్చేనెల 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఈ సినిమాలో నాగార్జున, వెంకటేష్ రెండు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకుడు.
First Published:  14 Nov 2015 7:03 PM GMT
Next Story