Telugu Global
Cinema & Entertainment

శృతి మించిన యాంకర్ శృతి

కేరళనాట ప్రస్తుతం ఓ యాంకర్ సెన్సేషన్ గా మారింది. తన అందచందాలతో తుఫాను సృష్టిస్తోంది. అవును.. శృతి మీనన్ అనే నటి కమ్ యాంకర్ టాప్ లెస్ గా నటించింది. దీంతో మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఓ బంగారు నగల యాడ్ కోసం శృతి మీనన్ ఇలా డేర్ చేసింది. పైభాగంలో ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఫొటోషూట్ లో పాల్గొంది. మెడలో నగలు మాత్రం కనిపిస్తాయి. యాడ్ థీమ్ ప్రకారం.. ఒంటిపై మా బ్రాండ్ నగలుంటే చాలు.. […]

శృతి మించిన యాంకర్ శృతి
X
కేరళనాట ప్రస్తుతం ఓ యాంకర్ సెన్సేషన్ గా మారింది. తన అందచందాలతో తుఫాను సృష్టిస్తోంది. అవును.. శృతి మీనన్ అనే నటి కమ్ యాంకర్ టాప్ లెస్ గా నటించింది. దీంతో మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఓ బంగారు నగల యాడ్ కోసం శృతి మీనన్ ఇలా డేర్ చేసింది. పైభాగంలో ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఫొటోషూట్ లో పాల్గొంది. మెడలో నగలు మాత్రం కనిపిస్తాయి. యాడ్ థీమ్ ప్రకారం.. ఒంటిపై మా బ్రాండ్ నగలుంటే చాలు.. మహిళలకు దుస్తులు కూడా అక్కర్లేదు అనేది సారాంశం. ఆ థీమ్ ను అందంగా ప్రజెంట్ చేసేందుకు ఇలా టాప్ లెస్ గా ఫొటోలకు పోజులిచ్చింది శృతి. దీంతో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. నగలుంటే చాలని, బట్టలు వేసుకోకపోయినా ఫర్వాలేదంటూ సదరు సంస్థ యాడ్ చేయడాన్ని నిరసిస్తున్నాయి. అలాంటి యాడ్ లో శృతి నటించడాన్ని ఖండిస్తున్నాయి. శృతి మాత్రం ఈ నిరసనలను తనదైన స్టయిల్ లో తిప్పికొట్టింది. కేరళ ప్రజలకు మంచి కళాత్మక హృదయం ఉందని అంటోంది. అలాంటి కళాహృదయులంతా తన యాడ్ చూసి మెచ్చుకుంటున్నారని చెబుతోంది.
Next Story