Telugu Global
Cinema & Entertainment

కృష్ణవంశీ కోసం అనుష్క పెళ్ళి వాయిదా

 కథ బాగుంటే.. అందులో తన పాత్ర బాగుంటే.. దర్శకుడి ట్రాక్ రికార్డు గురించి ఆలోచించనని గతంలోనే ప్రకటించింది స్వీటీ అనుష్క. చెప్పినట్టుగానే ఇప్పుడు చేసింది. ఫ్లాప్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమౌతోంది. చాలా రోజుల కిందటే రుద్రాక్ష అనే టైటిల్ తో ఓ కథ సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ కథను చాలామందికి వినిపించాడు కానీ సక్సెస్ కాలేకపోయాడు. ఫైనల్ గా దిల్ రాజు ద్వారా వెళ్లి అనుష్కను ఒప్పించగలిగాడు. కృష్ణవంశీ […]

కృష్ణవంశీ కోసం అనుష్క పెళ్ళి వాయిదా
X
కథ బాగుంటే.. అందులో తన పాత్ర బాగుంటే.. దర్శకుడి ట్రాక్ రికార్డు గురించి ఆలోచించనని గతంలోనే ప్రకటించింది స్వీటీ అనుష్క. చెప్పినట్టుగానే ఇప్పుడు చేసింది. ఫ్లాప్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమౌతోంది. చాలా రోజుల కిందటే రుద్రాక్ష అనే టైటిల్ తో ఓ కథ సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ కథను చాలామందికి వినిపించాడు కానీ సక్సెస్ కాలేకపోయాడు. ఫైనల్ గా దిల్ రాజు ద్వారా వెళ్లి అనుష్కను ఒప్పించగలిగాడు. కృష్ణవంశీ నెరేషన్ ను ఇష్టపడి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది అనుష్క. పైగా గతంలోనే దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తానని మాటివ్వడంతో, రుద్రాక్ష సినిమా ఫైనల్ అయింది. ఈ మూవీ కోసం అనుష్కకు కావాల్సినంత ఇవ్వడానికి ముందుకొచ్చాడు దిల్ రాజు. సినిమా కథ ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. అయితే కేవలం ఈ రుద్రాక్ష సినిమా కోసమే.. 35 ఏళ్ల అనుష్క తన పెళ్లిని వాయిదా వేసుకుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
First Published:  14 Nov 2015 7:07 PM GMT
Next Story