Telugu Global
Cinema & Entertainment

అఖిల్ మోక్ష‌జ్ఞ పేరు ఎందుకు చెప్పాడు?

యువ‌సామ్రాట్ అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఇటీవ‌ల ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ఓ వేదిక ఉన్న అఖిల్‌ను మీకు కాంపిటీష‌న్ హీరో ఎవ‌రు? అని అడిగిన‌పుడు, ఇంకెవ‌రు? బాల‌య్య కుమారుడు మోక్ష‌జ్ఞ అని చెప్పి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అస‌లు పోటీలో లేని, ఆ మాట కొస్తే.. ఇంకా ఎంట్రీ ఇవ్వ‌ని కుర్రాడు ఎలా కాంపిటీష‌న్ అవుతాడు? అని విలేక‌రులు, సినీజ‌నాలు బుర్ర‌లు గొక్కుంటున్నారు. అఖిల్   మోక్ష‌జ్ఞ కుటుంబాల చెలిమి ఈ రోజుది కాదు […]

అఖిల్ మోక్ష‌జ్ఞ పేరు ఎందుకు చెప్పాడు?
X
యువ‌సామ్రాట్ అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఇటీవ‌ల ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ఓ వేదిక ఉన్న అఖిల్‌ను మీకు కాంపిటీష‌న్ హీరో ఎవ‌రు? అని అడిగిన‌పుడు, ఇంకెవ‌రు? బాల‌య్య కుమారుడు మోక్ష‌జ్ఞ అని చెప్పి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అస‌లు పోటీలో లేని, ఆ మాట కొస్తే.. ఇంకా ఎంట్రీ ఇవ్వ‌ని కుర్రాడు ఎలా కాంపిటీష‌న్ అవుతాడు? అని విలేక‌రులు, సినీజ‌నాలు బుర్ర‌లు గొక్కుంటున్నారు. అఖిల్ మోక్ష‌జ్ఞ కుటుంబాల చెలిమి ఈ రోజుది కాదు తాతాల కాలం నాటిది. దాదాపు 60 ఏళ్ల‌పైగానే ఈ రెండు కుటుంబాలు తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో స్నేహంగా మెదులుతున్నాయి. తొలిత‌రంలో నాగేశ్వ‌ర‌రావు, ఎన్టీఆర్‌లు క‌లిసి న‌టించారు. త‌రువాత త‌రంలో నాగార్జున‌- హ‌రికృష్ణ‌లు తెర‌మీద క‌నిపించారు. ఇక ముచ్చ‌ట‌గా మూడోత‌రం కూడా వెండితెర‌పై క‌నువిందు చేస్తుంద‌నేది సినీ విశ్లేష‌కుల అంచ‌నా. అది నిజ‌మైతే ఇండ్ర‌స్ట్రీకి మంచిదే! అయితే, అఖిల్ మోక్షు విష‌యం ప్ర‌స్తావించ‌డం కాక‌తాళీయం కాద‌ని, కావాల‌నే ఈ వ్యాఖ్య‌లు చేశాడ‌ని అంటున్నారు కొంద‌రు.
ఏం జ‌రిగింది?
అఖిల్ ఇటీవ‌ల ఆమెరికాలో తెలుగువారు నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మానికి అతిథిగా వెళ్లాడు. అక్క‌డ వేదిక‌పై అఖిల్ ప్ర‌సంగిస్తున్నంత సేపు హీరో బాల‌క్రిష్ణ అభిమానులు చెల‌రేగిపోయారంట‌. అఖిల్ మాట్లాడుతున్నంత సేపు జై బాల‌య్య‌! జై బాల‌య్య! అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారంట‌. వారి తీరుతో అఖిల్ చాలా విసిగిపోయాడంట‌. త‌రువాత అదే కార్య‌క్ర‌మంలో మ‌రోచోట స్నేహితుల‌తో క‌లిసి అఖిల్ భోజ‌నం చేస్తుండ‌గా మ‌ళ్లీ నినాదాలు చేశారంట‌.. దీంతో కోప‌గించుకుని అక్క‌డ నుంచి వెళ్లిపోయాడంట అఖిల్‌. ఆ రోజు కార్య‌క్ర‌మంలో జ‌రిగిన దానికి నొచ్చుకున్న అఖిల్‌.. అందుకు స‌మాధానంగానే మోక్ష‌జ్ఞ ను త‌న‌కు కాంపిటీట‌ర్‌గా అనౌన్స్ చేశాడ‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రికొంద‌రేమో అఖిల్ చాలా స్పోర్టివ్ అని.. స‌ర‌దాగానే మోక్షు పేరు ప్ర‌స్తావించాడ‌ని స‌ర్ది చెబుతున్నారు.
First Published:  14 Nov 2015 7:09 PM GMT
Next Story