Telugu Global
CRIME

పట్టుబడ్డ పేకాటరాణులు

ఖమ్మం జిల్లాలో పేకాట ఆడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశమైంది. మగవాళ్లతో కలిసి పేకాట ఆడుతున్న ఏడుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా ఏ నాలుగు గోడల మధ్యో కాదు. పొలాల్లో పేకాట ఆడుతూ చిక్కారు. వేంసూరు మండలం లింగపాలెం గ్రామ సమీపంలో పేకాట స్థావరాలు నడుస్తున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. పోలీసులను చూసి కొందరు పారిపోయారు. ఏడుగురు మహిళలు మాత్రం దొరికిపోయారు. మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి […]

పట్టుబడ్డ పేకాటరాణులు
X

ఖమ్మం జిల్లాలో పేకాట ఆడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశమైంది. మగవాళ్లతో కలిసి పేకాట ఆడుతున్న ఏడుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా ఏ నాలుగు గోడల మధ్యో కాదు. పొలాల్లో పేకాట ఆడుతూ చిక్కారు. వేంసూరు మండలం లింగపాలెం గ్రామ సమీపంలో పేకాట స్థావరాలు నడుస్తున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.

పోలీసులను చూసి కొందరు పారిపోయారు. ఏడుగురు మహిళలు మాత్రం దొరికిపోయారు. మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళలు ఇలా పేకాట ఆడుతూ పట్టబడడం చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రాంతంలో కొందరు మహిళలు కూడా పేకాటకు బానిసలయ్యారని స్థానికులు చెబుతున్నారు.

First Published:  13 Nov 2015 1:09 PM GMT
Next Story