Telugu Global
Cinema & Entertainment

ఈసారైనా హిట్ కొడతాడా

హీరో సిద్ధార్థకు రోజులు బాగాలేవ్. ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఫ్లాపే. తెలుగు, హిందీ భాషల్లో ఎప్పుడో ఫేడవుట్ అయిపోయాడు. ఇప్పుడు తమిళనాట కూడా అతడి కెరీర్ మిణుకుమిణుకుమంటోంది. వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్నాడు. ప్రస్తుతం సిద్ధూదృష్టి అంతా ఓ క్రైంకామెడీ సినిమాపైనే ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. అదే ఫార్ములాతో జిల్ జంగ్ జక్ అనే సినిమా తీశాడు సిద్దార్థ్. ఈ సినిమాపైనే సిద్ధార్థ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే.. కేవలం డబ్బులు […]

ఈసారైనా హిట్ కొడతాడా
X
హీరో సిద్ధార్థకు రోజులు బాగాలేవ్. ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఫ్లాపే. తెలుగు, హిందీ భాషల్లో ఎప్పుడో ఫేడవుట్ అయిపోయాడు. ఇప్పుడు తమిళనాట కూడా అతడి కెరీర్ మిణుకుమిణుకుమంటోంది. వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్నాడు. ప్రస్తుతం సిద్ధూదృష్టి అంతా ఓ క్రైంకామెడీ సినిమాపైనే ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. అదే ఫార్ములాతో జిల్ జంగ్ జక్ అనే సినిమా తీశాడు సిద్దార్థ్. ఈ సినిమాపైనే సిద్ధార్థ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే.. కేవలం డబ్బులు తీసుకొని హీరోగా నటించి వెళ్లిపోవడం కాకుండా.. ఈ సినిమాలో డబ్బులు కూడా పెట్టాడు సిద్ధూ. అంటే హీరోగా నటిస్తూనే నిర్మాతగా కూడా మారాడన్నమాట. అందుకే ఈ సినిమా సిద్ధూ కెరీర్ కు చాలా కీలకం. ఇది కనుక ఫ్లాప్ అయితే.. హీరోగా ఫెయిల్ అవ్వడం మాట అటుంచి.. నిర్మాతగా డబ్బులు కూడా పోగొట్టుకునే స్థితికి చేరుకుంటాడు. అందుకే ఈ సినిమాను తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నాడు. స్వయంగా తనే ప్రచారం ఇవ్వాలనుకుంటున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదలకానుంది.
First Published:  13 Nov 2015 7:03 PM GMT
Next Story