శంకరాభరణం ఎందుకు పోస్ట్ పోన్ అయ్యింది..?
స్టార్ రైటర్ కోన వెంకట్ అన్నీ తానై యువ హీరో నిఖిల్ తో చేసిన శంకరాభరణం చిత్రం ఆడియో రిలీజ్ కు ముందు ఎంతో హైప్ , పాజిటివ్ టాక్ గెయిన్ చేసుకొంది. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం ఈ నెల 20న రిలీజ్ అవుతుందని ముందు ఎనౌన్స్ చేశారు. కానీ లేటెస్ట్ గా సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తేల్చింది. నిఖిల్ […]
BY sarvi14 Nov 2015 12:32 AM IST
X
sarvi Updated On: 14 Nov 2015 9:45 AM IST
స్టార్ రైటర్ కోన వెంకట్ అన్నీ తానై యువ హీరో నిఖిల్ తో చేసిన శంకరాభరణం చిత్రం ఆడియో రిలీజ్ కు ముందు ఎంతో హైప్ , పాజిటివ్ టాక్ గెయిన్ చేసుకొంది. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం ఈ నెల 20న రిలీజ్ అవుతుందని ముందు ఎనౌన్స్ చేశారు. కానీ లేటెస్ట్ గా సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తేల్చింది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో చేసిన ఈ సినిమాను బీహార్ లో కిడ్నాప్ ల బ్యాక్ డ్రాప్ మీద ఆధారపడి తీసినట్టుగా ఫిలిం నగర్ టాక్. నిఖిల్ గౌతమ్ పేరుతో అమెరికా నుంచి.. ఇండియాకు వచ్చిన తరువాత ఒకమ్మాయి ప్రేమలో పడటం..ఆ అమ్మాయి కోసం బీహార్ గ్యాంగ్ చేతిలో చిక్కడం.. చివరకు టామ్ అండ్ జెర్రి గేమ్ లో హీరో ఎలా విజయం సాధించాడు అనే పాయింట్ తో చేసిన చిత్రమే శంకరాభరణం అని తేలుస్తుంది.
అయితే ఈ చిత్రం పోస్ట్ పోన్ కావడానికి చిత్ర యూనిట్ ఆశించిన రీతిలో ..ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదనే టాక్ కూడా వినిపిస్తుంది. బడ్జెట్ కాస్త ఎక్కువ ఖర్చు పెట్టడంతో.. సినిమా బయ్యర్లకు కాస్త రేటు ఎక్కువ చెబుతున్నారట. అంతే కాకుండా..ఈ చిత్రం బి, సీ సెంటర్స్ ఆడియన్స్ కు అంతగా నచ్చక పోవచ్చనే అంశాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సినిమా అన్ని విధాల క్వాలీటి అవుట్ పుట్ వచ్చిందనే కాన్ఫిడెన్స్ తో వున్నారు. మరి లోలోపల ఏం జరగుతుందో గానీ.. డిసెంబర్ 4న శంకరాభరణం బయటకు రానుంది మరి. నిఖిల్ కూడా ఈ సినిమా తన కెరీర్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని ఆశిస్తున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Next Story