Telugu Global
Cinema & Entertainment

ఆడియో రిలీజ్ కు సిద్దం అవుతున్న ఎన్టీఆర్ సినిమా..

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రధారులు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. పోతే.. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు వచ్చే నెల 13న విడుదల కానున్నట్టు తాజా సమాచారం.  ఈ నెలాఖరున స్పెయిన్ వెళ్లనున్న […]

ఆడియో రిలీజ్ కు సిద్దం అవుతున్న ఎన్టీఆర్ సినిమా..
X

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రధారులు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. పోతే.. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు వచ్చే నెల 13న విడుదల కానున్నట్టు తాజా సమాచారం.
ఈ నెలాఖరున స్పెయిన్ వెళ్లనున్న చిత్ర బృందం అక్కడ షూటింగ్ ముగియగానే ఆడియో విడుదలతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తారట. మొన్న విడుదల చేసిన టీజర్‌లో దేవీ ‘ఫాలో.. ఫాలో..’ అనడమే ఆలస్యమన్నట్టు అందరూ ఆ ట్యూన్‌నే ఫాలో అవుతున్నారిప్పుడు. ఇక పూర్తి ఆల్బమ్‌తో ఆ ఫాలోయింగ్ ఇంకెంత పెరుగుతుందో..!

Next Story