Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్స్ గుండె ప‌గిలిందా..?

 ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల విషయం తెలిసి పలువురు హీరోయిన్లు స్పందించారు. తెల్లవారుజామునే జరిగిన ఈ ఘటన దారుణమంటూ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీరోయిన్లు అనుష్కాశర్మ, ప్రియాంకా చోప్రాలతో పాటు త్రిష, ఇలియానా లాంటి వాళ్లు కూడా ఈ ఘటనపై స్పందించారు. పొద్దున్న లేస్తూనే.. ప్యారిస్‌లో దాడుల గురించిన దారుణమైన విషయం తెలిసింది. ఈ పిరికిపందల దాడులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్యారిస్ ప్రజలకు మరింత ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను -అనుష్కాశర్మ ————————————————————————————– ప్యారిస్‌లో జరిగినది తెలిసి […]

హీరోయిన్స్ గుండె ప‌గిలిందా..?
X

ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల విషయం తెలిసి పలువురు హీరోయిన్లు స్పందించారు. తెల్లవారుజామునే జరిగిన ఈ ఘటన దారుణమంటూ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీరోయిన్లు అనుష్కాశర్మ, ప్రియాంకా చోప్రాలతో పాటు త్రిష, ఇలియానా లాంటి వాళ్లు కూడా ఈ ఘటనపై స్పందించారు.

పొద్దున్న లేస్తూనే.. ప్యారిస్‌లో దాడుల గురించిన దారుణమైన విషయం తెలిసింది. ఈ పిరికిపందల దాడులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్యారిస్ ప్రజలకు మరింత ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
-అనుష్కాశర్మ
————————————————————————————–
ప్యారిస్‌లో జరిగినది తెలిసి చాలా డిస్ట్రబ్ అయ్యాను. అసలు ఈ ప్రపంచానికి ఏమైపోతోంది.. ఈ హింసాకాండ జరగాల్సిన అవసరం ఏముంది.. ప్రే ఫర్ ప్యారిస్.. నా హృదయం గాయపడింది.
-ప్రియాంకా చోప్రా
————————————————————————————–
పారిస్ ఘటన గురించి వినగానే చాలా బాధ పడ్డాను, పారిస్ లో ఉగ్రదాడి బాధితులకు కోసం ప్రార్థిస్తున్నాను
-హన్సిక
————————————————————————————–
ప్యారిస్ గురించి ఇంత దారుణమైన వార్తా! ఆ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. అసలు ఈ జనం ఏం కావాలనుకుంటున్నారు.. (తన ఇన్‌స్టాగ్రామ్‌లో నల్లటి ఫొటో ఒకటి పెట్టింది)
-ఇలియానా
————————————————————————————–
త్రిష మాత్రం ఏమీ వ్యాఖ్యలు చేయకుండా.. ప్యారిస్ విషయం తెలిసి గుండె బద్దలైందంటూ సింబాలిక్‌గా గుండె పగిలిన బొమ్మ పెట్టింది.
-త్రిష

First Published:  13 Nov 2015 7:05 PM GMT
Next Story