Telugu Global
Cinema & Entertainment

నిర్మాత‌గా అల్లు అర్జున్

అల్లు అర్జున్ స్పీడ్ పెంచాడు, టాలీవుడ్‌తో పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా తనదైన ట్రేడ్ మార్క్ వేసుకోడానికి తెగ ట్రై చేస్తున్నాడు. ఎప్పటినుంచో తన హిట్ సినిమాల్ని వరుసపెట్టి మళయాళంలోకి అనువదించి రిలీజ్ చేస్తోన్న బన్నీ తాజాగా శాండిల్ వుడ్ బాక్సాఫీస్ నుంచి కూడా కలెక్షన్లు రాబట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే హీరోగా కాకుండా నిర్మాతగా మారి కన్నడ ఆడియెన్స్‌ను అలరించేందుకు బన్నీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగా తెలుగులో ఘనవిజయం సాధించిన భలే భలే […]

నిర్మాత‌గా అల్లు అర్జున్
X

అల్లు అర్జున్ స్పీడ్ పెంచాడు, టాలీవుడ్‌తో పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా తనదైన ట్రేడ్ మార్క్ వేసుకోడానికి తెగ ట్రై చేస్తున్నాడు. ఎప్పటినుంచో తన హిట్ సినిమాల్ని వరుసపెట్టి మళయాళంలోకి అనువదించి రిలీజ్ చేస్తోన్న బన్నీ తాజాగా శాండిల్ వుడ్ బాక్సాఫీస్ నుంచి కూడా కలెక్షన్లు రాబట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే హీరోగా కాకుండా నిర్మాతగా మారి కన్నడ ఆడియెన్స్‌ను అలరించేందుకు బన్నీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగా తెలుగులో ఘనవిజయం సాధించిన భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేసి విడుదల చేసే ఆలోచనలో అల్లుఅర్జున్ ఉన్నట్లుగా వినిపిస్తోంది. ఈ మూవీతో ప్రొడక్షన్ ఫీల్డ్‌లోకి బన్నీ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్‌లో ‘ఐ యామ్ దట్ ఛేంజ్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు బన్నీ పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పెద్ద చిత్రాన్ని నిర్మించేందుకు బన్నీ సంకల్పించడంతో ఈ విషయం పై ఫిల్మ్ నగర్‌లో రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం మంచిదే అయితే ఆ తీసేదేదో తెలుగులోనే తీస్తే బాగుంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక భలే భలే మగాడివోయ్ కన్నడ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్న రాక్ లైన్ వెంకటేశ్‌తో కలసే బన్నీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని సమాచారం. మరి హీరోగా తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ఫుల్ పాపులారిటి సంపాదించుకున్న అల్లుఅర్జున్ ఇప్పుడు నిర్మాతగా ఏ రేంజ్ లో వండర్స్ క్రియేట్ చేస్తాడో చూద్దాం.

Next Story