Telugu Global
Cinema & Entertainment

మొత్తానికి ముహూర్తం కుదిరింది

పడుతూ లేస్తూ సాగుతోంది వెంకీ-మారుతి సినిమా. ఒకసారి ఈ సినిమా ఉందంటారు.. మరోసారి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటారు. మొన్నటికి మొన్న మూవీ పక్కా అయిందన్నారు. దసరాకే ఓపెనింగ్ అన్నారు. కానీ పత్తా లేకుండా పోయారు. ఈసారి మాత్రం కన్ ఫర్మ్ అంటూ మరోసారి ప్రకటన చేశారు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్-మారుతి సినిమా ఈనెల 15న ప్రారంభం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటోంది ఫిలింనగర్. సినిమా టైటిల్ కూడా రాధ అనే పేరునే పెట్టే ఆలోచనలో ఉన్నారట. […]

మొత్తానికి ముహూర్తం కుదిరింది
X
పడుతూ లేస్తూ సాగుతోంది వెంకీ-మారుతి సినిమా. ఒకసారి ఈ సినిమా ఉందంటారు.. మరోసారి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటారు. మొన్నటికి మొన్న మూవీ పక్కా అయిందన్నారు. దసరాకే ఓపెనింగ్ అన్నారు. కానీ పత్తా లేకుండా పోయారు. ఈసారి మాత్రం కన్ ఫర్మ్ అంటూ మరోసారి ప్రకటన చేశారు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్-మారుతి సినిమా ఈనెల 15న ప్రారంభం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటోంది ఫిలింనగర్. సినిమా టైటిల్ కూడా రాధ అనే పేరునే పెట్టే ఆలోచనలో ఉన్నారట. అటు దర్శకుడు మారుతి సినిమా స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేశాడట. మరోవైపు హీరో వెంకటేష్ కూడా దేశంలోని కొన్ని రాష్ట్రాలకు చెందిన హోమ్ మంత్రుల బాడీ లాంగ్వేజెస్ ను పరిశీలించే పనిలో బిజీగా ఉన్నారట. ఎందుకంటే.. రాధ సినిమాలో వెంకీ హోం మినిస్టర్ గా కనిపించబోతున్నాడు. అందుకే హోం మినిస్టర్లు ఎలా నడుచుకుంటారు.. ఎలా మాట్లాడతారు.. లాంటి అఁశాలపై అవగాహన పెంచుకుంటున్నాడట. మరోవైపు ఈ సినిమాతో నయనతారను మరోసారి తెలుగుతెరపైకి తీసుకొచ్చేందుకు స్వయంగా వెంకీ ప్రయత్నిస్తున్నాడని సమాచారం.
Next Story