Telugu Global
International

కోహినూర్ వజ్రం మనకు దక్కేనా?

ఈ భూమి మీద అత్యంత విలువైన వజ్రాల్లో మన కోహినూర్ వజ్రం ఒకటి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ లో ఉంది. దీన్ని మనదేశానికి రప్పించేందుకు ఇప్పుడు పోరాటం మొదలైంది.మన వజ్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రప్పిస్తామంటోంది టిటోస్‌ సంస్థ. దీని కోసం బ్రిటన్‌తో ఆ దేశంలోనే న్యాయపోరాటానికి సిద్ధమైంది.    టిటోస్‌ సంస్థలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖ నటులు సభ్యులుగా ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు తేవాలని […]

కోహినూర్ వజ్రం మనకు దక్కేనా?
X
ఈ భూమి మీద అత్యంత విలువైన వజ్రాల్లో మన కోహినూర్ వజ్రం ఒకటి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ లో ఉంది. దీన్ని మనదేశానికి రప్పించేందుకు ఇప్పుడు పోరాటం మొదలైంది.మన వజ్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రప్పిస్తామంటోంది టిటోస్‌ సంస్థ. దీని కోసం బ్రిటన్‌తో ఆ దేశంలోనే న్యాయపోరాటానికి సిద్ధమైంది.
టిటోస్‌ సంస్థలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖ నటులు సభ్యులుగా ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు తేవాలని భావిస్తున్న టిటోస్‌… బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ను కూడా కోర్టుకు రప్పించేందుకు రెడీ అవుతోంది. ఒక వేళ బ్రిటన్‌లో జరిగే న్యాయ పోరాటంలో తాము ఓడిపోయినా వెనక్కి తగ్గబోమని టిటోస్ సంస్థ ప్రకటిస్తోంది. అవసరమైతే బ్రిటన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానంలోనూ పోరాడతామంటోంది.
కోహినూర్‌ వజ్రం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కృష్ణానది తీరంలో 8శతాబ్ధాల క్రితం లభించినట్టు ఆధారాలున్నాయి. 105 క్యారెట్ల స్వచ్ఛమైన ఈ వజ్రం అప్పట్లో ఎంతో మంది రాజులు, చక్రవర్తుల చేతులు మారింది. ఆతర్వాత బ్రిటీష్ వాళ్లు మన దేశానికి వచ్చాక.. మన సంపదను కొల్లగొట్టారు. అందులో కోహినూర్ వజ్రం కూడా ఉంది. ఈ విషయం మనదేశంతోపాటు ప్రపంచం మొత్తానికి తెలుసు.
ప్రస్తుతం బ్రిటన్ రాణి విక్టోరియా కిరీణంలో ఒదిగిపోయింది. ఈ వజ్రాన్ని అరుదుగా ధరించిన క్వీన్‌ విక్టోరియా భవిష్యత్తులోనూ రాణులు మాత్రమే దీన్ని ధరించాలని వీలూనామా రాశారు. విక్టోరియా మృతి తర్వాత కోహినూర్‌ వజ్రం బ్రిటన్‌ రాణి కిరీటంలో భాగంగా మారింది. మరి టిటోస్ సంస్థ చెప్తున్నట్టు కోహినూర్ వజ్రం భారత్ కు తిరిగి రావాలని కోరుకుందాం.
First Published:  11 Nov 2015 12:00 AM GMT
Next Story