Telugu Global
NEWS

మైసూరా పేరుతో తప్పుడు ఇంటర్వ్యూ ?

మైసూరారెడ్డి రాయలసీమ కోసం ఉద్యమం చేయబోతున్నారన్న వార్తలొస్తున్న వేళ ఇప్పుడు ఓ పత్రిక కొత్త వివాదానికి తెరలేపింది. ఓ ఆంగ్ల పత్రిక మైసూరారెడ్డి పేరుతో ఓ పెద్ద ఇంటర్వ్యూను ప్రచురించింది. ”ఇకపై రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం” పేరుతో మైసూరా ఇంటర్వ్యూను ఆ పత్రిక ప్రచురించింది. అయితే ఈ ఇంటర్వ్యూపై మైసూరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తాను ఏ విలేకరికి  ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పారు. ఇంటర్వ్యూ చేయకుండా తనపేరుతో ఎలా ప్రచురిస్తారని ఆగ్రహం వ్యక్తం […]

మైసూరా పేరుతో తప్పుడు ఇంటర్వ్యూ ?
X

మైసూరారెడ్డి రాయలసీమ కోసం ఉద్యమం చేయబోతున్నారన్న వార్తలొస్తున్న వేళ ఇప్పుడు ఓ పత్రిక కొత్త వివాదానికి తెరలేపింది. ఓ ఆంగ్ల పత్రిక మైసూరారెడ్డి పేరుతో ఓ పెద్ద ఇంటర్వ్యూను ప్రచురించింది. ”ఇకపై రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం” పేరుతో మైసూరా ఇంటర్వ్యూను ఆ పత్రిక ప్రచురించింది. అయితే ఈ ఇంటర్వ్యూపై మైసూరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు తాను ఏ విలేకరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పారు. ఇంటర్వ్యూ చేయకుండా తనపేరుతో ఎలా ప్రచురిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆంగ్ల పత్రికలో తనను ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రచురితమైన కథనాన్ని చూసి విస్మయం చెందానని చెప్పారు. తనను ఇంటర్వ్యూ చేయకుండానే కథనం ప్రచురించినందుకు సదరు పత్రిక క్షమాపణ చెప్పాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు.

First Published:  11 Nov 2015 12:43 AM GMT
Next Story