Telugu Global
CRIME

నకిలీ వీసాలతో దొరికిపోయిన ముగ్గురు ప్రయాణికులు

నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ప్రయాణికుల సాధారణ తనిఖీల్లో భాగంగా వీసాలను చెక్‌ చేస్తున్నప్పుడు అధికారులకు అనుమానం వచ్చింది. నిశితంగా పరిశీలించగా వీరు నకిలీ వీసాలతో విదేశీ ప్రయాణం చేయవచ్చని భావించి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసి పోయింది. దీంతో వీరు ముగ్గురిని విమానాశ్రయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన […]

నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ప్రయాణికుల సాధారణ తనిఖీల్లో భాగంగా వీసాలను చెక్‌ చేస్తున్నప్పుడు అధికారులకు అనుమానం వచ్చింది. నిశితంగా పరిశీలించగా వీరు నకిలీ వీసాలతో విదేశీ ప్రయాణం చేయవచ్చని భావించి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసి పోయింది. దీంతో వీరు ముగ్గురిని విమానాశ్రయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన హుస్సేన్‌, రాజామణి, లక్ష్మీదేవిగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Next Story