Telugu Global
Others

సీమ రాష్ట్రానికి వ్యతిరేకం

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు పాలన చూసిన తర్వాత తమ వెనుకబాటుతనం శాశ్వతంగా ఉండిపోతుందేమోనన్న భయం రాయలసీమ , ఉత్తరాంధ్ర ప్రజల్లో నెలకొందన్నారు. రాష్ట్రాన్ని సమ దృష్టితో పాలించాల్సిందిపోయి  అభివృద్ధిని మొత్తం ఒకే చోట కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు. అందవికారంగా ఉన్నా అమ్మను అమ్మగానే చెప్పుకుంటామని చంద్రబాబు మాత్రం ఊరి పేరు చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నారని రఘువీరా విమర్శించారు.  చివరకు ప్రజలను నమ్మించేందుకు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ బుల్లెట్‌లా దూసుకెళ్తా అంటూ […]

సీమ రాష్ట్రానికి వ్యతిరేకం
X

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు పాలన చూసిన తర్వాత తమ వెనుకబాటుతనం శాశ్వతంగా ఉండిపోతుందేమోనన్న భయం రాయలసీమ , ఉత్తరాంధ్ర ప్రజల్లో నెలకొందన్నారు. రాష్ట్రాన్ని సమ దృష్టితో పాలించాల్సిందిపోయి అభివృద్ధిని మొత్తం ఒకే చోట కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు.

అందవికారంగా ఉన్నా అమ్మను అమ్మగానే చెప్పుకుంటామని చంద్రబాబు మాత్రం ఊరి పేరు చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నారని రఘువీరా విమర్శించారు. చివరకు ప్రజలను నమ్మించేందుకు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ బుల్లెట్‌లా దూసుకెళ్తా అంటూ సినిమా డైలాగ్‌లు చెప్పుకునే దుస్థితికి దిగజారారని విమర్శించారు. చంద్రబాబు పాలనతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. అయితే మరో రాష్ట్రం కావాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని రఘువీరారెడ్డి చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మెడలు వంచేలా పోరాటం చేస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం చేస్తామంటూ పలువురు సీమ నేతలు చెబుతున్న వేళ ఆ అంశంపై కాంగ్రెస్ తరపున రఘువీరారెడ్డి క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంది.

First Published:  11 Nov 2015 12:10 PM GMT
Next Story