Telugu Global
Cinema & Entertainment

ఫ్యాన్స్ ను ఫిదా చేసిన  షారుక్

ఇటీవలే తన యాభయ్యో పుట్టిన రోజు జరుపుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్, మరోసారి తన అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అమితాబ్ తరువాత అదే స్ధాయిలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షారూఖ్, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ, తానే వ్యక్తిగతంగా ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ రోజంతా తన తన ఇంటికి వచ్చిన అభిమానులను, సన్నిహితులను కలుస్తూ ఎంతో ఆనందంగా గడిపాడు షారూక్. అక్కడితో వదిలేయకుండా తనకు […]

ఫ్యాన్స్ ను ఫిదా చేసిన  షారుక్
X

ఇటీవలే తన యాభయ్యో పుట్టిన రోజు జరుపుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్, మరోసారి తన అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అమితాబ్ తరువాత అదే స్ధాయిలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షారూఖ్, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ, తానే వ్యక్తిగతంగా ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ రోజంతా తన తన ఇంటికి వచ్చిన అభిమానులను, సన్నిహితులను కలుస్తూ ఎంతో ఆనందంగా గడిపాడు షారూక్.

అక్కడితో వదిలేయకుండా తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ఓ ఆశ్చర్యకరమైన రిటర్న్ గిఫ్ట్ ను పంపాడు బాద్ షా. షారూక్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ దిల్ వాలే. షారూక్ సరసన కాజోల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను అఫీషియల్ రిలీజ్ కంటే ముందు తనకు శుభాకాంక్షలు తెలిపిన ఫ్యాన్స్ ట్విట్టర్ అకౌంట్ లకు నేరుగా పోస్ట్ చేశాడు కింగ్ ఖాన్. షారూక్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తో షాక్ అయిన అభిమానులు, ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.

షారూక్, కాజోల్ లతో పాటు వరుణ్ ధవన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. షారూక్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్ మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

First Published:  9 Nov 2015 7:11 PM GMT
Next Story