Telugu Global
Others

రాజధాని భూముల్లో బాలయ్య వియ్యంకుడికి 498 ఎకరాలు

తాను అధికారంలో ఉండగా ఎక్కడా కూడా బంధువులను ప్రోత్సహించలేదంటూ ట్రాక్ రికార్డు చూపే చంద్రబాబు మెడకు ఇప్పుడు బాలయ్య వియ్యంకుడు చుట్టుకున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో ఏకంగా 300 కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అందులోనూ ప్రమాదకరమైన రసాయనాలు వెదజల్లే కెమికల్ ఫ్యాక్టరీకి రాజధాని పరిధిలో భూములు కేటాయించడం కలకలం రేపుతోంది.  సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో బాలయ్య వియ్యంకుడు ఎంవీవీఎస్ రామారావు సీఎండిగా ఉన్న విశాఖ బాట్లింగ్ […]

రాజధాని భూముల్లో బాలయ్య వియ్యంకుడికి 498 ఎకరాలు
X

తాను అధికారంలో ఉండగా ఎక్కడా కూడా బంధువులను ప్రోత్సహించలేదంటూ ట్రాక్ రికార్డు చూపే చంద్రబాబు మెడకు ఇప్పుడు బాలయ్య వియ్యంకుడు చుట్టుకున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో ఏకంగా 300 కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అందులోనూ ప్రమాదకరమైన రసాయనాలు వెదజల్లే కెమికల్ ఫ్యాక్టరీకి రాజధాని పరిధిలో భూములు కేటాయించడం కలకలం రేపుతోంది.

సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో బాలయ్య వియ్యంకుడు ఎంవీవీఎస్ రామారావు సీఎండిగా ఉన్న విశాఖ బాట్లింగ్ కంపెనీకి 498 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఎకరం భూమి విలువ రూ.60 లక్షలు ఉండగా కేవలం ఎకరా లక్ష రూపాయలకు అప్పగించారు. ఈ భూమి విలువ 300 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ స్థలంలో రోజుకు 4,400 టన్నుల అమ్మోనియా, 7,700 టన్నుల యూరియా, 800 టన్నుల నైట్రిక్ యాసిడ్ ఉత్పిత్తి చేసే ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు 135 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి చేసే కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

ఈ కంపెపీ ఏర్పాటుపై స్థానికులు,పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల తయారీకి ఉపయోగించే కెమికల్స్ లీక్ అయితే భారీ ప్రాణనష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీ ఏర్పాటు ఎంతమాత్రమూ సరికాదంటున్నారు. కంపెపీ సీఎండీ రామారావు ఎవరంటే గీతం యూనివర్శిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి కుమారుడు, బాలకృష్ణకు వియ్యంకుడు, మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు అల్లుడు అవుతారు . రామారావు కుమారుడికి హీరో బాలకృష్ణ చిన్న కూతురిని ఇచ్చి వివాహం చేశారు. ఇలా బంధుగణమంతా కలిసి పావులు కదిపి కారుచౌకగా 300 కోట్ల విలువైన భూమిని కొట్టేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

First Published:  10 Nov 2015 2:15 AM GMT
Next Story