Telugu Global
Cinema & Entertainment

ఫోర్బ్స్‌కు ఎక్కిన ప్రియమణి

ముద్దుగుమ్మ ప్రియమణి మరో ఖ్యాతిగడించారు. ఏకంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలోకి ఎక్కారామె. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ దేశంలోని ప్రముఖుల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో ప్రియమణి పేరు ఉన్నట్టు మ్యాగజైన్ వర్గాలు తెలిపాయి. నటులు పునీతరాజ్‌కుమార్, సుదీప్ టాపర్స్ జాబితాలో ముందువరుసలో ఉన్నారు. ప్రముఖుల పూర్తి జాబితాను డిసెంబర్ 11న వెల్లడిస్తారు . కొన్నేళ్లుగా ఫోర్బ్స్ ఇండియా ప్రముఖుల జాబితాను ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు శాండల్ వుడ్ నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. […]

ఫోర్బ్స్‌కు ఎక్కిన ప్రియమణి
X

ముద్దుగుమ్మ ప్రియమణి మరో ఖ్యాతిగడించారు. ఏకంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలోకి ఎక్కారామె. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ దేశంలోని ప్రముఖుల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో ప్రియమణి పేరు ఉన్నట్టు మ్యాగజైన్ వర్గాలు తెలిపాయి. నటులు పునీతరాజ్‌కుమార్, సుదీప్ టాపర్స్ జాబితాలో ముందువరుసలో ఉన్నారు. ప్రముఖుల పూర్తి జాబితాను డిసెంబర్ 11న వెల్లడిస్తారు . కొన్నేళ్లుగా ఫోర్బ్స్ ఇండియా ప్రముఖుల జాబితాను ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు శాండల్ వుడ్ నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. అయితే వీరి ద్వారా తొలిసారిగా ఆ లోటు తీరబోతోంది.

Next Story