Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమా పేరు రోబో-2 కాదు

త్వరలోనే రోబో-2 సినిమా సెట్స్ పైకి రాబోతోంది. రజనీకాంత్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్నారు. దాదాపు వందకోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించేందుకు ఓ ఎన్నారై కూడా ముందుకొచ్చాడు. అటు రజనీకాంత్ కూడా శంకర్ చెప్పిన స్క్రీన్ ప్లేకు ఓకే చెప్పేశాడు. దీంతో ఇక సినిమా ప్రారంభం కావడమే ఆలస్యమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నాడట శంకర్. రోబోకు సీక్వెల్ […]

ఆ సినిమా పేరు రోబో-2 కాదు
X
త్వరలోనే రోబో-2 సినిమా సెట్స్ పైకి రాబోతోంది. రజనీకాంత్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్నారు. దాదాపు వందకోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించేందుకు ఓ ఎన్నారై కూడా ముందుకొచ్చాడు. అటు రజనీకాంత్ కూడా శంకర్ చెప్పిన స్క్రీన్ ప్లేకు ఓకే చెప్పేశాడు. దీంతో ఇక సినిమా ప్రారంభం కావడమే ఆలస్యమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నాడట శంకర్. రోబోకు సీక్వెల్ గావస్తున్న ఈ సినిమాకు రోబో-2 అని కాకుండా మరో పేరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. రోబో సినిమాలో మరమనిషికి పెట్టిన చిట్టి అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు. మొత్తమ్మీద రోబోకు సీక్వెల్ గావస్తున్న సినిమాకు మాత్రం రోబో-2 అనే టైటిల్ ఉండబోదని క్లారిటీ ఇచ్చాడు శంకర్. ఈ సినిమా కోసం ఇప్పటికే ఆర్నాల్డ్ ష్కాజనెగర్ ను విలన్ గా తీసుకున్నారు. హీరోయిన్ గా అమీ జాక్సన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి.
Next Story