Telugu Global
Cinema & Entertainment

చోటా రాజ‌న్‌ను మిస్స‌యిన వ‌ర్మ‌

దేశంలో ఎక్క‌డ నేరం, సంచ‌ల‌నం జ‌రిగినా.. అక్క‌డ ముందే ఉంటాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. అలాంటి ఘ‌ట‌న ఏది జ‌రిగినా కుదిరితే సినిమా..క‌నీసం ట్వీట్ చేసి వ‌దిలితేగానీ ఆయ‌న‌కు ప్ర‌శాంత‌త ఉండ‌దు. స‌త్య సినిమాతో మాఫియాను క‌ళ్ల‌కు క‌ట్టిన రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌రువాత ముంబై మాఫియాలో దావూద్ ఎదిగిన తీరును, అత‌ని అనుచ‌రుడు చోటారాజ‌న్‌తో త‌లెత్తిన విభేదాలే నేప‌థ్యంగా కంపెనీ సినిమా తీసి భారీ హిట్ సొంతం చేసుకున్నాడు. ఏపీలో జ‌రిగిన కొన్ని హ‌త్యల ఆధారంగా గాయం, […]

చోటా రాజ‌న్‌ను మిస్స‌యిన వ‌ర్మ‌
X
దేశంలో ఎక్క‌డ నేరం, సంచ‌ల‌నం జ‌రిగినా.. అక్క‌డ ముందే ఉంటాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. అలాంటి ఘ‌ట‌న ఏది జ‌రిగినా కుదిరితే సినిమా..క‌నీసం ట్వీట్ చేసి వ‌దిలితేగానీ ఆయ‌న‌కు ప్ర‌శాంత‌త ఉండ‌దు. స‌త్య సినిమాతో మాఫియాను క‌ళ్ల‌కు క‌ట్టిన రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌రువాత ముంబై మాఫియాలో దావూద్ ఎదిగిన తీరును, అత‌ని అనుచ‌రుడు చోటారాజ‌న్‌తో త‌లెత్తిన విభేదాలే నేప‌థ్యంగా కంపెనీ సినిమా తీసి భారీ హిట్ సొంతం చేసుకున్నాడు. ఏపీలో జ‌రిగిన కొన్ని హ‌త్యల ఆధారంగా గాయం, ర‌క్త‌చ‌రిత్ర‌-1, ర‌క్త‌చ‌రిత్ర‌-2లు తీసి శ‌భాష్ అనిపించాడు. త‌రువాత 2008లో ముంబైలో జరిగిన ముంబై దాడుల‌పైనా సినిమా తీశాడు. ఇప్ప‌టికే గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్‌పై సినిమా దీపావ‌ళికి విడుద‌ల కానుంది. ఇటీవ‌ల దేశంలో సంచ‌ల‌నం రేపిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి అయిన ఇంద్రాణి ముఖ‌ర్జియాపైనా సినిమా తీస్తాన‌ని వ‌ర్మ‌ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన అంశాలే నేప‌థ్యాలుగా వ‌ర్మ చాలా సినిమాలు తీశాడు. తాజాగా చోటా రాజ‌న్ అరెస్టుపై ట్వీట్లు చేశాడు. వెంట‌నే సినిమా కూడా అనౌన్స్ చేస్తాడని ఎదురు చూసిన సినీజ‌నాల‌కు నిరాశే ఎదురైంది.
సంజయ్ గుప్తా ప్ర‌క‌టించేశాడు
రామ్ గోపాల్ వ‌ర్మ ఇత‌ర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడో.. లేకుంటే.. చోటారాజ‌న్ విష‌యాన్ని లైట్ తీసుకున్నాడో ఏమో గానీ, ఈ విష‌యంలో సంజ‌య‌గుప్తా అడ్వాన్స్ అయ్యాడు. అభిషేక్ బ‌చ్చ‌న్ హీరోగా చోటారాజ‌న్ జీవిత‌చ‌రిత్ర ఆధారంగా సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించేశాడు సంజ‌య్‌గుప్తా. ఒక అనామ‌క యువ‌కుడు ముంబై నేర‌సామ్రాజ్యాన్ని ఎలా శాసించాడ‌న్న చాలా పాత నేప‌థ్యంతో ఈ సినిమా తీస్తున్న‌ట్లు స‌మాచారం. తెలిసిన క‌థ‌లు సినిమాగా తీస్తే.. ఎలాంటి ప‌బ్లిసిటీ అక్క‌ర్లేకుండా జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారు. ఈ సూత్రం బాగా తెలిసిన‌వాడు వ‌ర్మ‌. పైగా వ‌ర్మ తీసిన ప్ర‌తి సినిమా హిందీతోపాటు ద‌క్షిణాది భాష‌ల్లోకి అనువ‌దించి మార్కెట్ చేసుకోవ‌చ్చు. అయితే, వ‌ర్మ‌ఈసారి ఆ చాన్స్ మిస్స‌య్యాడని కొంద‌రు అంటుంటే.. ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు లేకుండా ఇదే సినిమాను అత‌నికంటే ముందే థియేట‌ర్ల‌లోకి వ‌ద‌ల‌డ‌న్న గ్యారెంటీ ఏంటి? అని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు. రెండు వాద‌న‌ల్లోనూ నిజం లేక‌పోలేదు.
First Published:  8 Nov 2015 7:06 PM GMT
Next Story