Telugu Global
Others

వారసత్వంలోనూ లాలూదే అదృష్టం

బిహార్ ప్రజలు ఈ ఎన్నికలలో వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిచే వారికి కూడా తగిన రీతిలోనే బుద్ధి చెప్పారు. ఒక్క లాలూ ప్రసాద్ కుమారులు మాత్రమే దీనికి మినహాయింపు. లాలూ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి గెలుపొందితే మరో కుమారుడు తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధీంచారు. చాలా మంది నాయకుల కొడుకులు, అల్లుళ్లు, ఇతర దగ్గరి బంధువులు ఓటమి పాలయ్యారు. బిహార్ మాజీ ముఖ్య మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జగన్నాథ్ మిశ్రా […]

వారసత్వంలోనూ లాలూదే అదృష్టం
X

బిహార్ ప్రజలు ఈ ఎన్నికలలో వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిచే వారికి కూడా తగిన రీతిలోనే బుద్ధి చెప్పారు. ఒక్క లాలూ ప్రసాద్ కుమారులు మాత్రమే దీనికి మినహాయింపు. లాలూ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి గెలుపొందితే మరో కుమారుడు తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధీంచారు.

చాలా మంది నాయకుల కొడుకులు, అల్లుళ్లు, ఇతర దగ్గరి బంధువులు ఓటమి పాలయ్యారు. బిహార్ మాజీ ముఖ్య మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జగన్నాథ్ మిశ్రా కుమారుడు నితీశ్ మిశ్రా బీజేపీ అభ్యర్థిగా జంఝర్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయారు. ఆయన మాజీ మంత్రి కూడా. మాజీ ముఖ్య మంత్రి, హిందుస్తాని అవామీ మోర్చా అధ్యక్షుడు జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోశ్ తో పాటు, ఇండిపెండెంటుగా పోటీ చేసిన మాంఝీ అల్లుడు దేవేంద్ర కుమార్ మాంఝీ ఓటమి పాలయ్యారు. హిందుస్తాన్ అవామీ మోర్చా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నరేంద్ర సింగ్ కుమారుడు సుమిత్ సింగ్ చకాయ్ నియోజక వర్గంలో ఓడి పోయారు.

పార్లమెంటులో బీజేపీ సభ్యుడు అశ్వనీ కుమార్ చౌబే కుమారుడు అజిత్ శాశ్వత్ చౌబేను కూడా విజయం వరించలేదు. కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ తమ్ముడు పశుపతి కుమార్ పారస్ అలౌలీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. పాశ్వాన్ దగ్గరి బంధువు ప్రిన్స్ రాజ్ కల్యాణ్ పూర్ లో పరాజితులయ్యారు. పాశ్వాన్ అల్లుడు అనిల్ కుమార్ సాధూకు బొచాచా నియోజక వర్గంలో అదే గతి పట్టింది. అంటే పాశ్వాన్ బంధువులు ముగ్గురిని ఓటర్లు ఏ మాత్రం కరుణించలేదు.

బీజేపీ ఎంపీ సి.పి.ఠాకూర్ కుమారుఛు వేవేక్ ఠాకూర్ బెర్హంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు ఓడించారు. హిందుస్తాన్ అవామీ మోర్చ నాయకుడు శకుని చౌదరి కుమారుడు రాజేశ్ కుమార్ సైతం ఖగారియాలో పరాజితులయ్యారు.

ఈ పరాజయాలను బట్టి చూస్తే బిహార్ ప్రజలు వంశాంకురాలను ఎదగనివ్వకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. రాజకీయ నాయకుల కుమారులు రాజకీయాలలో ఉండకూడదని శాసించలేం కాని అది వంశపారంపర్య హక్కుగా చెలామణి చేయాలనుకునే వారికి ఈ పరాజాయాలు కను విప్పు కలిగిస్తే ఎంతబాగుండును.

– భరణి

First Published:  9 Nov 2015 10:57 AM GMT
Next Story