Telugu Global
Cinema & Entertainment

త్రిపుర ప్ల‌స్ పాయింట్స్ ఇవే...

ఈ సినిమాకి బాగా హెల్ప్ అయిన ప్లస్ పాయింట్.. హర్రర్ కామెడీ కథాంశానికి ఓ మంచి థ్రిల్లింగ్ పాయింట్ ని జతచేయడమే..  సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే చివర్లో వచ్చే 15 నిమిషాలు సినిమాకి హైలైట్ అయ్యింది. ఇకపోతే సినిమాకి మొదటి 20 నిమిషాలు బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో ఇచ్చే ట్విస్ట్ ఎపిసోడ్ బాగుంది. దానితో పాటు సినిమా […]

త్రిపుర ప్ల‌స్ పాయింట్స్ ఇవే...
X

ఈ సినిమాకి బాగా హెల్ప్ అయిన ప్లస్ పాయింట్.. హర్రర్ కామెడీ కథాంశానికి ఓ మంచి థ్రిల్లింగ్ పాయింట్ ని జతచేయడమే.. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే చివర్లో వచ్చే 15 నిమిషాలు సినిమాకి హైలైట్ అయ్యింది. ఇకపోతే సినిమాకి మొదటి 20 నిమిషాలు బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో ఇచ్చే ట్విస్ట్ ఎపిసోడ్ బాగుంది. దానితో పాటు సినిమా మధ్య మధ్యలో వచ్చే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ సినిమాకి బాగానే హెల్ప్ అవుతాయి.

నటీనటుల్లో ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది ముగ్గురు.. వాళ్ళే స్వాతి, నవీన్ చంద్ర మరియు పూజ రామచంద్రన్. టైటిల్ రోల్ పోషించిన స్వాతి త్రిపుర అనే పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మొదట్లో అమాయకత్వం, అల్లరి చేసే అమ్మాయిలా కనిపిస్తూ మెప్పిస్తే, తర్వాత తన కలల ద్వారా భయపడే హావభావాలను చాలా బాగా పలికించింది. ఇక చివర్లో స్వాతి చేసిన దెయ్యం సీన్ లో మాత్రం సూపర్బ్ గా చేసింది. నవీన్ చంద్ర మెయిన్ లీడ్ లో స్వాతికి పర్ఫెక్ట్ సపోర్ట్ ని ఇస్తూ సినిమాని నడిపించాడు. తనకి ఇబ్బందులు వస్తున్నప్పుడు తను చేసిన నటనే సినిమాకి హెల్ప్ అయ్యింది. చిన్న పాత్ర చేసినా పూజ రామచంద్రన్ మాత్రం చాలా బాగా చేసింది. క్లైమాక్స్ లో స్వాతి – పూజ కాంబినేషన్ సీన్ సూపర్బ్. శకలక శంకర్ – సప్తగిరి – జయప్రకాశ్ రెడ్డిలు సెకండాఫ్ లో కాస్త నవ్వించారు. ఇది కాకుండా ఫస్ట్ హాఫ్ లో సప్తగిరి అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసాడు. సినిమా మొదట్లో పెళ్లి కొడుకులా ధనరాజ్ కాసేపు నవ్వించి వెళ్ళిపోయాడు. రావు రమేష్, శ్రీమాన్ తదితర నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించి వెళ్ళిపోయారు.

First Published:  7 Nov 2015 7:02 PM GMT
Next Story