Telugu Global
Cinema & Entertainment

ఈగ విల‌న్‌తో నిత్య ప్రేమాయ‌ణం

అలా మొద‌లైంది.. ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌యిందే వంటి వ‌రుస హిట్లతో తెలుగులో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మ‌ళ‌యాళ చిన్న‌ది నిత్యా మీన‌న్‌.. ఇప్పుడు ప్రేమ‌లో మునిగింద‌ట‌. మ‌రి ఆ అదృష్ట‌వంతుడు ఎవ‌రో కాదు, ఈగ ఫేమ్ సుదీప్‌! ఈ వార్త ఇప్పుడు సౌత్ ఇండియా అంతా హాట్ టాపిక్‌గా మారింది.  తెలుగులో ఈగ త‌రువాత సుదీప్ బాహుబ‌లిలో క‌నిపించాడు. ప్రస్తుతం సుదీప్ తమిళం, తెలుగు భాషలలో ముడింజా ఇవనై పీడీ అనే చిత్రంలో హీరోగా […]

ఈగ విల‌న్‌తో నిత్య ప్రేమాయ‌ణం
X
అలా మొద‌లైంది.. ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌యిందే వంటి వ‌రుస హిట్లతో తెలుగులో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మ‌ళ‌యాళ చిన్న‌ది నిత్యా మీన‌న్‌.. ఇప్పుడు ప్రేమ‌లో మునిగింద‌ట‌. మ‌రి ఆ అదృష్ట‌వంతుడు ఎవ‌రో కాదు, ఈగ ఫేమ్ సుదీప్‌! ఈ వార్త ఇప్పుడు సౌత్ ఇండియా అంతా హాట్ టాపిక్‌గా మారింది. తెలుగులో ఈగ త‌రువాత సుదీప్ బాహుబ‌లిలో క‌నిపించాడు. ప్రస్తుతం సుదీప్ తమిళం, తెలుగు భాషలలో ముడింజా ఇవనై పీడీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి నిర్మాత కూడా ఆయనే. కేఎస్.రవికుమార్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో నిత్య మీన‌న్ హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య స్నేహం చిగురించింద‌ని, అది కాస్తా ప్రేమ‌గా మారింద‌నే టాక్ బ‌య‌ల్దేరింది. ఇవి కేవ‌లం గాసిప్సేనా.. లేదా నిజ‌మేనా అన్న‌ది వారే చెప్పాలి.
తెలుగులో త‌క్కువే!
దక్షిణాదిన హీరోహీరోయిన్ల మ‌ధ్య ప్రేమ క‌థ‌లు స‌హ‌జ‌మే! అయినా ఇలాంటి పోక‌డ తెలుగులో చాలా త‌క్కువ‌. ఈ విష‌యంలో త‌మిళ ప‌రిశ్ర‌మ ముందు స్థానంలో ఉంటుంది. చిత్ర‌షూటింగ్ స‌మ‌యంలో న‌టీన‌టుల మ‌ధ్య ప్రేమ పుట్ట‌డం. మ‌రోసినిమా మొద‌ల‌య్యేలోపు అది ఆవిర‌వ‌డం త‌మిళంలో స‌హ‌జ‌మే. అంటే అక్క‌డా బాలీవుడ్ సంస్కృతి మొద‌లైంది. ఇలాంటివి న‌టీన‌టులు మాత్రం ఒప్పుకోక‌పోవ‌డం విశేషం. తాము స్నేహితుల‌మేన‌ని, మీడియాలో ఏదో రాసినంత మాత్రాన స్పందించ‌న‌వ‌స‌రం లేద‌ని సెల‌విస్తారు. తెలుగులో నాగార్జున‌-అమ‌ల‌, జీవితా-రాజ‌శేఖ‌ర్‌, ప‌వ‌న్‌- రేణు, మ‌హేశ్‌-న‌మ్ర‌త త‌దిత‌రులు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నారు. అంటే ఇక్కడంతా సంప్ర‌దాయ త‌ర‌హా ప్రేమ‌క‌థ‌లే. డేటింగ్ చేసి క‌టీఫ్ చెప్పే ల‌వ్‌స్టోరీలు దాదాపుగా లేవ‌నే చెప్ప‌వ‌చ్చు.
Next Story