సెట్‌లో అఖిల్ మూర్చపోయాడట
అఖిల్ సినిమా చిత్రీకరణలో భాగంగా హీరో అఖిల్ మూర్చపోయాడట. సినిమాలో కీలకమైన ఎంట్రీ సాంగ్‌ను చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ సాంగ్‌లో గ్లామరస్‌గా కనిపించడం కోసం అఖిల్ ఎలాంటి ఆహారం తీసుకోలేదు.. అలాగే డాన్స్ రిహాల్సస్ చేశాడు. ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమీ కాలేదు. కానీ, అఖిల్ కనీసం మంచినీళ్లు కూడా తాగలేదంట. దీంతో సాంగ్ షూటింగ్ చేస్తున్నపుడు మధ్యలోనే హీరో అఖిల్ మూర్చపోయాడట. దీంతో దర్శకుడు, వినాయక్‌తో సహా […]
BY sarvi7 Nov 2015 7:07 PM GMT
X
sarvi Updated On: 8 Nov 2015 6:52 AM GMT
అఖిల్ సినిమా చిత్రీకరణలో భాగంగా హీరో అఖిల్ మూర్చపోయాడట. సినిమాలో కీలకమైన ఎంట్రీ సాంగ్‌ను చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ సాంగ్‌లో గ్లామరస్‌గా కనిపించడం కోసం అఖిల్ ఎలాంటి ఆహారం తీసుకోలేదు.. అలాగే డాన్స్ రిహాల్సస్ చేశాడు. ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమీ కాలేదు. కానీ, అఖిల్ కనీసం మంచినీళ్లు కూడా తాగలేదంట. దీంతో సాంగ్ షూటింగ్ చేస్తున్నపుడు మధ్యలోనే హీరో అఖిల్ మూర్చపోయాడట. దీంతో దర్శకుడు, వినాయక్‌తో సహా నిర్మాత నితిన్ తీవ్ర ఆందోళనకు గురయ్యారట. హీరోకి సెట్‌లో ఇలా అయ్యిందేంటని కంగారుపడ్డారంట.
వెంటనే స్పృహలోకి వచ్చిన అఖిల్ అసలు విషయం చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారట. గ్లామరస్‌గా కనబడాలని తొలి సినిమా నుంచే అఖిల్ కడుపుమాడ్చుకోవడం అతని చిత్తశుద్ధికి నిదర్శనమని చిత్రయూనిట్ అభినందింస్తోంది. అయితే, డైట్ లో ఉండండి..కానీ మంచినీళ్లు తీసుకోకుండా ఇలాంటి ప్రయోగాలు మంచివి కావని అఖిల్‌కు సూచించారట దర్శకుడు వినాయక్, నిర్మాత నితిన్.
Also Read: కమల్‌కి చెల్లిగా పుడతా: షకీలా
Next Story