Telugu Global
Cinema & Entertainment

అఖిల్‌లో అది ఎక్కువే

అఖిల్ ఈ మూడ‌క్ష‌రాల్లో చాలా విష‌యం ఉంద‌ని అప్పుడే టాక్ మొద‌లైంది. అఖిల్‌కు వ్య‌క్తిత్వం చాలా సూటిగా ఉంద‌ని, ఈ యువ‌కుడిలో ఆత్మ‌విశ్వాసం చాలా ఎక్కువ‌ని ఒక‌సారి మాట్లాడిన వారెవ‌రైనా చెప్పేస్తున్నారు. ఆ మాట‌కారిత‌నం, టైమింగ్ చూస్తుంటే.. అఖిల్‌ తాత అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గుర్తుకు వ‌స్తున్నాడ‌ని చాలామంది చెబుతున్నారు. ఈ విష‌యాల‌న్నీ అక్కినేని అభిమానుల‌కు ఎంతో ఆనందానిస్తున్నాయి. అలాగే  సినిమా మీద అంచ‌నాల‌ను కూడా పెంచుతున్నాయి. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో నెల‌కొన్న సందిగ్దం అఖిల్ చొర‌వ‌తోనే […]

అఖిల్‌లో అది ఎక్కువే
X
అఖిల్ ఈ మూడ‌క్ష‌రాల్లో చాలా విష‌యం ఉంద‌ని అప్పుడే టాక్ మొద‌లైంది. అఖిల్‌కు వ్య‌క్తిత్వం చాలా సూటిగా ఉంద‌ని, ఈ యువ‌కుడిలో ఆత్మ‌విశ్వాసం చాలా ఎక్కువ‌ని ఒక‌సారి మాట్లాడిన వారెవ‌రైనా చెప్పేస్తున్నారు. ఆ మాట‌కారిత‌నం, టైమింగ్ చూస్తుంటే.. అఖిల్‌ తాత అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గుర్తుకు వ‌స్తున్నాడ‌ని చాలామంది చెబుతున్నారు. ఈ విష‌యాల‌న్నీ అక్కినేని అభిమానుల‌కు ఎంతో ఆనందానిస్తున్నాయి. అలాగే సినిమా మీద అంచ‌నాల‌ను కూడా పెంచుతున్నాయి. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో నెల‌కొన్న సందిగ్దం అఖిల్ చొర‌వ‌తోనే సద్దుమ‌ణిగింద‌ని ప్ర‌చారం. అఖిల్ సినిమా చూసిన యువ‌సామ్రాట్ నాగార్జున కొన్ని స‌న్నివేశాల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశాడ‌ని, రీషూట్ చేయాల‌ని సూచించాడ‌ని స‌మాచారం. అయితే అఖిల్ క‌లుగజేసుకుని తండ్రిని ఒప్పించాడ‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. అఖిల్ మంచి మాట‌కారి అని, సీనియ‌ర్ల‌యినా నాగార్జున ఎదుట నిల‌బ‌డే ధైర్యం చేయ‌ర‌ని, అలాంటిది అఖిల్ ఆయ‌న్ని ఒప్పించాడంటే.. అత‌ని ఆత్మ‌విశ్వాసం చాలా గొప్ప‌ద‌న్న టాక్ ఇండ‌స్ర్టీ మొత్తం పాకిపోయింది.
అందుకే దీపావ‌ళికి వ‌స్తున్నాడు..!
అనుకున్న షెడ్యూలు ప్ర‌కారం.. సినిమా ద‌స‌రా పండ‌క్కి థియేట‌ర్ల‌లోకి రావాలి. అయితే, కొడుకు లాంచింగ్ ఘ‌నంగా ఉండాల‌ని నాగార్జున సినిమాలోని కొన్ని దృశ్యాల‌ను రీషూట్ చేయాల‌ని చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో నిర్మాత నితిన్ తీవ్ర ఆందోళ‌న చెందాడ‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. అప్ప‌టికే అఖిల్ సినిమా బ‌డ్జెట్ దాదాపు 40 కోట్లు దాట‌డంతో నితిన్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఇంక సినిమా సంక్రాంతికేన‌ని పుకార్లు రేగాయి. సంక్రాంతికి విడుద‌ల అంటే.. ప్రాజెక్టుపై నెగిటివ్ టాక్ పెరిగిపోతుంద‌ని ముందే గ్ర‌హించిన అఖిల్ తండ్రిని ఒప్పించాడట‌. రీషూట్ అవ‌స‌రం లేకుండా గ్రాఫిక్స్ వ‌ర‌కు కొత్త‌గా చేయించాడ‌ని తెలిసింది. సినిమా యూనిట్‌కు తండ్రికి మ‌ధ్య వార‌ధిలా వ్య‌వ‌హ‌రించిన అఖిల్‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కూడా ఎక్క‌వేన‌ని చిత్రబృందం ఈ కుర్ర‌హీరోకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింద‌ట‌. మొత్తానికి అఖిల్‌ చొర‌వ నిర్మాత నితిన్ గుండెల‌పై కొండంత భారాన్ని దించింది.
First Published:  7 Nov 2015 8:07 AM GMT
Next Story