Telugu Global
Cinema & Entertainment

శ్రీదేవి సవితికొడుకు బూట్‌పాలిష్ చేస్తున్నాడా? 

సీనియర్ యాక్టర్, బ్యూటీ క్వీన్ శ్రీదేవికి సవితికొడుకు ఉన్న సంగతి తెలిసిందే.శ్రీదేవికి బోని కపూర్‌కి రెండో భార్య . బోనీకపూర్ మొదటి భార్య కొడుకే అర్జున్ కపూర్. బాలివుడ్‌లో ప్రస్తుతం ఎదుగుతున్న ప్రామిసింగ్ హీరోల్లో అర్జున్ కపూర్ కూడా ఉన్నాడు. కాని సంధర్బం వస్తే మాత్రం అర్జుణ్ కపూర్ తనకు శ్రీదేవి పట్ల ఉన్న అయిష్టాన్ని ఏమాత్రం దాచుకోడు… శ్రీదేవికి మా అమ్మ స్థానం ఎప్పటికి ఇవ్వలేను. ఆమె కేవలం మా నాన్న భార్య.. అంతే! అంటుంటాడు. […]

శ్రీదేవి సవితికొడుకు బూట్‌పాలిష్ చేస్తున్నాడా? 
X
సీనియర్ యాక్టర్, బ్యూటీ క్వీన్ శ్రీదేవికి సవితికొడుకు ఉన్న సంగతి తెలిసిందే.శ్రీదేవికి బోని కపూర్‌కి రెండో భార్య . బోనీకపూర్ మొదటి భార్య కొడుకే అర్జున్ కపూర్. బాలివుడ్‌లో ప్రస్తుతం ఎదుగుతున్న ప్రామిసింగ్ హీరోల్లో అర్జున్ కపూర్ కూడా ఉన్నాడు. కాని సంధర్బం వస్తే మాత్రం అర్జుణ్ కపూర్ తనకు శ్రీదేవి పట్ల ఉన్న అయిష్టాన్ని ఏమాత్రం దాచుకోడు… శ్రీదేవికి మా అమ్మ స్థానం ఎప్పటికి ఇవ్వలేను. ఆమె కేవలం మా నాన్న భార్య.. అంతే! అంటుంటాడు. అలాగని శ్రీదేవి,, అతడి చేత బూట్‌పాలిష్ చేయిస్తే, చేసేటంత చిన్న పిల్లోడు మాత్రం కాదు. విషయానికొస్తే అర్జుణ్ త్వరలో టెలికాస్ట్ కాబోయే ఒక‌ TV షో ‘మిషన్ సప్నె’ అనే ప్రోగ్రాం కోసం బూట్ పాలిష్ చేసాడు. ఆ TV షో కాన్‌సెప్ట్ ప్రకారం, స్టార్ హీరోలు ఒక్క రోజు ‘కామన్ మ్యాన్’ లా జీవించాలి. దీనిలో భాగంగా పోలియోతో బాధపడుతున్న ఒక బూట్ పాలిష్ చేసే ‘కామన్ మ్యాన్’ కోసం అర్జున్ ఒక్క రోజు బూట్ పాలిషర్‌గా మారాడు. దానితో వచ్చిన డబ్బులు, ఆ బూట్ పాలిషర్‌కే ఇస్తారు. స్టార్ హీరో కనుక పైసలు బాగానే రాలుతాయి మరి. అదీ సంగతి. అయితే ఇందులో శ్రీదేవి పాపం ఏమీ లేదు సుమా!
First Published:  6 Nov 2015 7:07 PM GMT
Next Story