Telugu Global
Cinema & Entertainment

 జీవితం ధ‌న్యం అంటోన్న సోన‌మ్ క‌పూర్‌

సోన‌మ్ కపూర్ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఆమె న‌టించిన ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రం ఈ దీపావ‌ళికి ఆడియ‌న్స్ ముందుకు రానుంది. తొలిసారి స‌ల్మాన్ ఖాన్ జోడీగా న‌టించిన ఈ అమ్మడు ఏమి నా భాగ్యమూ.. అని పాడుకుంటోంది. స‌ల్మాన్‌తో క‌లిసి న‌టించ‌టం వ‌ల్ల చాలా నేర్చుకున్నాను అంటోంది అనిల్ క‌పూర్ కూతురు. అదీగాక ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రంలో  సోన‌మ్ అందం, అభిన‌యం ముందు ఏకంగా మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్యారాయ్‌లు దిగ‌దుడుపే అని ఇటీవ‌ల […]

 జీవితం ధ‌న్యం అంటోన్న సోన‌మ్ క‌పూర్‌
X

సోన‌మ్ కపూర్ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఆమె న‌టించిన ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రం ఈ దీపావ‌ళికి ఆడియ‌న్స్ ముందుకు రానుంది. తొలిసారి స‌ల్మాన్ ఖాన్ జోడీగా న‌టించిన ఈ అమ్మడు ఏమి నా భాగ్యమూ.. అని పాడుకుంటోంది. స‌ల్మాన్‌తో క‌లిసి న‌టించ‌టం వ‌ల్ల చాలా నేర్చుకున్నాను అంటోంది అనిల్ క‌పూర్ కూతురు. అదీగాక ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రంలో సోన‌మ్ అందం, అభిన‌యం ముందు ఏకంగా మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్యారాయ్‌లు దిగ‌దుడుపే అని ఇటీవ‌ల స‌ల్మాన్ కితాబిచ్చాడు. దీనికి సోన‌మ్ లోలోప‌ల మురిసిపోయినా.. వారితో పోల్చుకోలేన‌ని చెబుతోంది. వాస్తవానికి 2007 సంవ‌త్సరంలో కెరీర్ ఆరంభించిన సోన‌మ్ క‌పూర్‌కు ఢిల్లి-6, రాంజానా, భాగ్ మిల్కా భాగ్ చిత్రాలు మిన‌హా చెప్పుకోద‌గినవి లేవు. బాలీవుడ్ ఫ్యాష‌న్ బేబ్‌గా హ‌ల్చల్ చేస్తున్నసోన‌మ్ సినిమాల‌కంటే ర్యాంప్ వాక్‌ల‌పైనే న‌డ‌వ‌టానికి ఇష్టప‌డేది. మొత్తానికి ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రం త‌న కెరీర్‌కు మంచి బూస్టప్ ఇస్తుంద‌ని సోన‌మ్ న‌మ్మకంగా ఉంది.

Next Story