Telugu Global
Cinema & Entertainment

మనం సీన్ అఖిల్ లో కూడా రిపీట్?

అవును.. మనం క్లైమాక్స్ లో కనిపించిన ఆ ముచ్చటైన సన్నివేశం మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కానుంది. మనం సినిమాలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. అక్కినేని అఖిల్ తెరపైకి వస్తాడు. ఇప్పుడు అఖిల్ సినిమాలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నాగచైతన్య, నాగార్జున తెరపైకి రాబోతున్నారు. ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచి, రిలీజ్ నాడు సర్ ప్రైజ్ ఇద్దామని భావిస్తోంది యూనిట్.  మనం సినిమా క్లయిమాక్స్ లో అఖిల్ వస్తే.. అఖిల్ సినిమా స్టార్టింగ్ లోనే నాగ్, చైతూ వచ్చేస్తారు. […]

మనం సీన్ అఖిల్ లో కూడా రిపీట్?
X
అవును.. మనం క్లైమాక్స్ లో కనిపించిన ఆ ముచ్చటైన సన్నివేశం మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కానుంది. మనం సినిమాలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. అక్కినేని అఖిల్ తెరపైకి వస్తాడు. ఇప్పుడు అఖిల్ సినిమాలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నాగచైతన్య, నాగార్జున తెరపైకి రాబోతున్నారు. ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచి, రిలీజ్ నాడు సర్ ప్రైజ్ ఇద్దామని భావిస్తోంది యూనిట్.
మనం సినిమా క్లయిమాక్స్ లో అఖిల్ వస్తే.. అఖిల్ సినిమా స్టార్టింగ్ లోనే నాగ్, చైతూ వచ్చేస్తారు. మూవీ ప్రారంభమైన పావుగంటకే అఖిల్ పై ఇంట్రో సాంగ్ వస్తుందట. ఆ పాటలో అఖిల్ తో పాటు నాగార్జున, నాగచైతన్య కూడా తళుక్కున మెరవనున్నారని సమాచారం. దీనిపై యూనిట్ మాత్రం స్పందించడం లేదు. అసలు అఖిల్ లో ఆ ఇద్దరు ఉన్నారో లేదో తెలియాలంటే జస్ట్ ఓ 3 రోజులు ఆగితే సరిపోతుంది.
First Published:  6 Nov 2015 7:02 PM GMT
Next Story