Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్యతో ముచ్చటగా మూడో సినిమా

నాగచైతన్య-గౌతమ్ మీనన్ ది హిట్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరూ కలిసి ఏమాయచేశావె సినిమా చేశారు. అది బ్రహ్మాండంగా ఆడింది. తర్వాత తాజాగా సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా చేస్తున్నారు. ఇదింకా విడుదల కావాల్సి ఉంది. ఇంతలోనే నాగచైతన్యతో మూడో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు గౌతమ్ మీనన్. త్వరలోనే చైతూతో మరో సినిమా చేస్తానంటున్నాడు. ఏమాయచేశావె, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలకు భిన్నంగా తమ హ్యాట్రిక్ కాంబినేషన్ ఉంటుందంటున్నారు.  ఇదిలా ఉండగా చైతూ-గౌతమ్ మూడో ప్రాజెక్ట్ కు […]

నాగచైతన్యతో ముచ్చటగా మూడో సినిమా
X
నాగచైతన్య-గౌతమ్ మీనన్ ది హిట్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరూ కలిసి ఏమాయచేశావె సినిమా చేశారు. అది బ్రహ్మాండంగా ఆడింది. తర్వాత తాజాగా సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా చేస్తున్నారు. ఇదింకా విడుదల కావాల్సి ఉంది. ఇంతలోనే నాగచైతన్యతో మూడో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు గౌతమ్ మీనన్. త్వరలోనే చైతూతో మరో సినిమా చేస్తానంటున్నాడు. ఏమాయచేశావె, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలకు భిన్నంగా తమ హ్యాట్రిక్ కాంబినేషన్ ఉంటుందంటున్నారు.
ఇదిలా ఉండగా చైతూ-గౌతమ్ మూడో ప్రాజెక్ట్ కు సంబంధించి మరో సంచలనాన్ని కూడా బయటపెట్టాడు గౌతమ్. ఎప్పుడు ఒకేసారి రెండు భాషల్లో సినిమాలు చేసే ఈ దర్శకుడు.. ఈసారి ఒకేసారి 4 భాషల్లో సినిమా చేస్తానంటున్నాడు. తెలుగులో చైతూతో, తమిళ్ లో సింబూతో, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో ఒకేసారి ఒకేసినిమా చేస్తానంటున్నాడు. మలయాళంలో స్టార్ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు.
First Published:  6 Nov 2015 7:08 PM GMT
Next Story