Telugu Global
Cinema & Entertainment

 వాహ్‌.. ప్రేమ్‌ కా ఫ్యాన్స్

ఈ ఫొటోలో ఉండే జ‌నం బిహార్‌లోని రాజ‌కీయ‌నాయ‌కుల పెద్దల స‌భ‌కు హాజ‌రైన వారు కాదు.. క్రికెట్ చూడ‌టానికి వ‌చ్చిన వారంత‌క‌న్నా కాదు. సాక్షాత్తూ స‌ల్మాన్ భాయ్‌ని చూడ‌టానికి వ‌చ్చిన విదార్థులు. స‌ల్మాన్ న‌టించిన తాజా చిత్రం  ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో  ప్రొమోష‌న్‌లో భాగంగా క‌థానాయిక సోన‌మ్ క‌పూర్ తో క‌లిసి నోయిడాలోని అమిటీ యూనివ‌ర్శిటీకి వెళ్లాడు. అంతే అక్కడి స్టూడెంట్స్ ప్రవాహంలా వ‌చ్చారు. స‌ల్మాన్‌.. స‌ల్మాన్ అంటూ తెగ గంతులేశారు. ఆ వీరాభిమాన‌త్వాన్ని చూసి ఈ […]

 వాహ్‌.. ప్రేమ్‌ కా ఫ్యాన్స్
X

ఈ ఫొటోలో ఉండే జ‌నం బిహార్‌లోని రాజ‌కీయ‌నాయ‌కుల పెద్దల స‌భ‌కు హాజ‌రైన వారు కాదు.. క్రికెట్ చూడ‌టానికి వ‌చ్చిన వారంత‌క‌న్నా కాదు. సాక్షాత్తూ స‌ల్మాన్ భాయ్‌ని చూడ‌టానికి వ‌చ్చిన విదార్థులు. స‌ల్మాన్ న‌టించిన తాజా చిత్రం ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో ప్రొమోష‌న్‌లో భాగంగా క‌థానాయిక సోన‌మ్ క‌పూర్ తో క‌లిసి నోయిడాలోని అమిటీ యూనివ‌ర్శిటీకి వెళ్లాడు. అంతే అక్కడి స్టూడెంట్స్ ప్రవాహంలా వ‌చ్చారు. స‌ల్మాన్‌.. స‌ల్మాన్ అంటూ తెగ గంతులేశారు. ఆ వీరాభిమాన‌త్వాన్ని చూసి ఈ బాలీవుడ్ పండుగాడు తెగ మురిసిపోయాడు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో షేరింగ్ చేసి మ‌రీ ముచ్చట ప‌డ్డాడు. ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో ఈ దీవాళికి విడుద‌ల అవుతోంది. ఇందులో భాగంగా త‌న కుర్రక‌థానాయిక సోన‌మ్‌ను వెంటేసుకుని స‌ల్మాన్ తెగ బిజీగా తిరుగుతున్నాడు. ఈ మ‌ధ్యే సోన‌మ్‌తో వ‌య్యారంగా ర్యాంప్ వాక్ చేశాడు. అన్నట్లు మైనే ప్యార్ కియా ద‌ర్శకుడు సూర‌జ్ ఆర్ బ‌ర్జాత్యా దాదాపు ప‌ద‌హారేళ్ల త‌ర్వాత స‌ల్మాన్ తో రూపొందించిన చిత్రం ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో. అందుకే ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రేమ్‌, విజ‌య్ అనే రెండు పాత్రల్ని స‌ల్మాన్ పోషించాడు. మొత్తానికి అల‌నాటి కుర్ర ప్రేమ్‌లా ఈ ముదురు వ‌య‌సులోనూ స‌ల్మాన్ అల‌రిస్తాడో లేదో చూడాలి మ‌రి.

First Published:  5 Nov 2015 7:02 PM GMT
Next Story