Telugu Global
Cinema & Entertainment

తమన్నా డ్రెస్సులో తుఫాను

‘కాఫీ కప్పులో తూఫాను’ అనే వాడుక ఉంది కాని, ‘డ్రెస్సులో తూఫాను’ ఏమిటి అనే డవుట్ రావడం సహజం. కాని తమన్న ఇటీవల IIFA కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్‌ఫెరెన్స్ కోసం వేసుకొచ్చిన డ్రెస్ దాదాపు తూఫాను రేపినంత పనీ చేసింది. ఒక ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో కళ్ళు జిగేలు మనిపించేలా అందరినీ ఆశ్చర్య పరిచింది. కాని అదే కొంపముంచింది కూడా. మన లోకల్ మీడియా అంతా తమన్న పబ్లిసిటీ కోసమే ఇంత చేసిందని.. లేకపోతే చిన్నపాటి […]

తమన్నా డ్రెస్సులో తుఫాను
X

‘కాఫీ కప్పులో తూఫాను’ అనే వాడుక ఉంది కాని, ‘డ్రెస్సులో తూఫాను’ ఏమిటి అనే డవుట్ రావడం సహజం. కాని తమన్న ఇటీవల IIFA కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్‌ఫెరెన్స్ కోసం వేసుకొచ్చిన డ్రెస్ దాదాపు తూఫాను రేపినంత పనీ చేసింది. ఒక ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో కళ్ళు జిగేలు మనిపించేలా అందరినీ ఆశ్చర్య పరిచింది. కాని అదే కొంపముంచింది కూడా. మన లోకల్ మీడియా అంతా తమన్న పబ్లిసిటీ కోసమే ఇంత చేసిందని.. లేకపోతే చిన్నపాటి ప్రెస్ కాన్‌ఫెరెన్స్‌కి ఇంతలా ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ అవసరం లేదని గగ్గోలు పెడుతోంది. డ్రెస్ అసభ్యంగా ఉందని కూడా వాపోతోంది. కాని బాలీవుడ్ మీడియా నుంచి ఆమెకు ఫుల్ సపోర్ట్ వస్తోంది. తమన్నా వేసుకున్న డ్రెస్ వల్గర్‌గా లేదని.. జాగ్రత్తగా చూస్తే అది ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ కాదని వాదిస్తున్నారు. మనిషన్నాక కొద్దిగా కళాత్మకత ఉండాలని, తమన్నా డ్రెస్ కూడా అలాంటిదే అని ఆమె బోల్డ్ డ్రెస్సింగ్ సెన్స్‌కి దాసోహం అంటున్నది బాలివుడ్ మీడియా. అయినా ‘బాహుబలి’ లాంటి సూపర్ హిట్ తర్వాత, తమన్నాకి అంత చీప్ ట్రిక్స్ అవసరం లేదని, ఫ్యాషన్‌లో బోల్డ్ గా ట్రై చేసిందని తమన్నాని నెత్తినెక్కించుకుంటున్నారు.

Next Story