Telugu Global
Others

ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్ లో మార్పులు?

తెల్ల చొక్క. ఖాకీ నిక్కర్. నల్ల టోపీ. బ్రౌన్ కలర్ క్యాన్వాస్ బెల్ట్.. ఇదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గా పిలుచుకునే ఆర్ఎస్ఎస్ సభ్యుల యూనిఫాం. సెప్లెంబర్ 27, 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటైనప్పటి నుంచి కాలక్రమేనా కొన్ని మార్పులు జరిగినా ఇదే యూనిఫాం కొనసాగుతూ వస్తోంది. 1930లో ఖాకీ టోపీ స్థానంలో నల్లటోపీ, 1940లో ఖాకీ చొక్కాకు బదులు వైట్ షర్ట్ వచ్చింది. అప్పట్లో ఆర్ఎస్ఎస్ ను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించడంతో ఈ మార్పులు చేశారు. […]

ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్ లో మార్పులు?
X
తెల్ల చొక్క. ఖాకీ నిక్కర్. నల్ల టోపీ. బ్రౌన్ కలర్ క్యాన్వాస్ బెల్ట్.. ఇదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గా పిలుచుకునే ఆర్ఎస్ఎస్ సభ్యుల యూనిఫాం. సెప్లెంబర్ 27, 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటైనప్పటి నుంచి కాలక్రమేనా కొన్ని మార్పులు జరిగినా ఇదే యూనిఫాం కొనసాగుతూ వస్తోంది. 1930లో ఖాకీ టోపీ స్థానంలో నల్లటోపీ, 1940లో ఖాకీ చొక్కాకు బదులు వైట్ షర్ట్ వచ్చింది. అప్పట్లో ఆర్ఎస్ఎస్ ను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించడంతో ఈ మార్పులు చేశారు. ఇక 2011లో తోలు బెల్ట్ స్థానంలో క్యాన్వాస్ బెల్ట్ వచ్చింది.
ఒకప్పుడు ఖాకీ నిక్కర్, వైట్ షర్ట్ వేసుకుని ఆర్ఎస్ఎస్ సైనికుడిగా ఉండాలంటే గర్వంగా ఫీలయ్యేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్న పిల్లల దగ్గర్నుంచీ ఇప్పుడంతా ఫ్యాంట్లు వేసుకుంటున్నారు. అందుకే ఇంకా నిక్కర్ వేసుకోవడానికి నేటి తరం యువత ఇష్టపడడం లేదు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అంతర్జాతీయ సంస్థ హిందూ స్వయం సేవక్ సంఘ్ లో ప్యాంట్లు ధరిస్తున్నారు అలాంటిది మనమూ ఇంకా ఎందుకు ఈ పాత పద్దతిలోనే అన్న భావన ఆర్ఎస్ఎస్ లోనూ కలిగింది.
అందుకే డ్రస్ కోడ్ లో మార్పు చేసే విషయంపై దేశ వ్యాప్తంగా అభిప్రాయ సేకరణకు సిద్ధమవుతోంది. కేంద్ర కార్యవర్గ సభ్యులు, లోకల్ ప్రచారక్ లతో కలిసి సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తారు. వచ్చే ఏడాది జరిగే ఆర్ఎస్ఎస్ సదస్సులో నివేదిక ఇస్తారు. ఆ నివేదికను బట్టి ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్ మార్చాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు. మొత్తం మీద కాలంతోపాటు మనమూ మారాలన్న ఆర్ఎస్ఎస్ నాయకుల ధోరణికి అందులోని సభ్యులు ఎలాంటి అభిప్రాయం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
First Published:  5 Nov 2015 11:09 PM GMT
Next Story