Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సినిమాను సెన్సార్ చేసిన కింగ్

అక్కినేని నటవారసుడు, మూడో తరం హీరో అఖిల్ వెండితెర ఎంట్రీకి సిద్ధమైపోయాడు. దీపావళి కానుకగా ఈనెల 11న తన పేరుమీదే సినిమా విడుదలచేస్తూ.. హీరోగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ వాళ్లు ఈ మూవీకి u/a సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే సెన్సారోళ్లు ఇచ్చిన సర్టిఫికేట్ కంటే ముందే అఖిల్ సినిమాకు మరో సెన్సార్ పూర్తయింది. అదే నాగార్జున సెన్సార్. అవును.. అఖిల్ సినిమాను ఎడిట్ రూమ్ లోనే సెన్సార్ […]

అఖిల్ సినిమాను సెన్సార్ చేసిన కింగ్
X
అక్కినేని నటవారసుడు, మూడో తరం హీరో అఖిల్ వెండితెర ఎంట్రీకి సిద్ధమైపోయాడు. దీపావళి కానుకగా ఈనెల 11న తన పేరుమీదే సినిమా విడుదలచేస్తూ.. హీరోగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ వాళ్లు ఈ మూవీకి u/a సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే సెన్సారోళ్లు ఇచ్చిన సర్టిఫికేట్ కంటే ముందే అఖిల్ సినిమాకు మరో సెన్సార్ పూర్తయింది. అదే నాగార్జున సెన్సార్. అవును.. అఖిల్ సినిమాను ఎడిట్ రూమ్ లోనే సెన్సార్ చేశాడట నాగార్జున. సినిమాను ఆసాంతం చూసిన కింగ్, మూవీకి డ్రాబ్యాక్ గా భావించిన సన్నివేశాలన్నింటినీ కట్ చేసి పడేశాటట. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు ఉండే ఓ సాంగ్ ను సగానికి సగం లేపేశాడని సమాచారం. అలా నాగ్ చేతిలో సెన్సార్ పూర్తయిన తర్వాతే అసలైన సెన్సార్ కు వెళ్లిందట అఖిల్ సినిమా. సరే.. ఈ సంగతి అటుంచితే.. అఖిల్ మూవీ ఫస్టాఫ్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉందని టాక్.
First Published:  5 Nov 2015 7:08 PM GMT
Next Story