Telugu Global
Cinema & Entertainment

స్వీటీ 22 కిలోలు ఎప్పటిలోగా త‌గ్గుతుంది?

సైజ్ జీరో సినిమా కోసం స‌హ‌జంగానే భారీకాయం సొంతం చేసుకున్న అనుష్క ఇప్పుడు బ‌రువు త‌గ్గేందుకు చెమ‌టోడుస్తుంద‌ట‌. సైజ్ జోరోలో భారీ దేహంతో అంద‌రినీ ఆశ్య‌ర్యంలో ముంచెత్తిన అనుష్క అందుకోసం తెర‌వెనుక చాలా క‌ష్ట‌ప‌డిందంట‌. ఈ సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌కాశ్ ల‌డ్డూ బాబు త‌ర‌హాలో మేక‌ప్‌తో స‌రిపెడ‌తామ‌ని చెప్పినా.. త‌ను ఒప్పుకోలేద‌ని స‌మాచారం. ఎంత బ‌రువు పెర‌గాలో చెప్పండంటూ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ బ‌రువు పెరిగి చూపెట్టింది. దీంతో సినిమాలో స‌హ‌జంగానే లావుగా క‌నిపించాల‌న్న అనుష్క త‌ప‌న నెర‌వేరింది. […]

స్వీటీ 22 కిలోలు ఎప్పటిలోగా త‌గ్గుతుంది?
X
సైజ్ జీరో సినిమా కోసం స‌హ‌జంగానే భారీకాయం సొంతం చేసుకున్న అనుష్క ఇప్పుడు బ‌రువు త‌గ్గేందుకు చెమ‌టోడుస్తుంద‌ట‌. సైజ్ జోరోలో భారీ దేహంతో అంద‌రినీ ఆశ్య‌ర్యంలో ముంచెత్తిన అనుష్క అందుకోసం తెర‌వెనుక చాలా క‌ష్ట‌ప‌డిందంట‌. ఈ సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌కాశ్ ల‌డ్డూ బాబు త‌ర‌హాలో మేక‌ప్‌తో స‌రిపెడ‌తామ‌ని చెప్పినా.. త‌ను ఒప్పుకోలేద‌ని స‌మాచారం. ఎంత బ‌రువు పెర‌గాలో చెప్పండంటూ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ బ‌రువు పెరిగి చూపెట్టింది. దీంతో సినిమాలో స‌హ‌జంగానే లావుగా క‌నిపించాల‌న్న అనుష్క త‌ప‌న నెర‌వేరింది. బ‌రువుగా లేకుంటే పాత్ర‌కు న్యాయం చేయ‌లేమోన‌న్న అనుష్క ఆందోళ‌నే ఇందుకు కార‌ణ‌మ‌ని సినిమా యూనిట్ ఆమెను అభినందించ‌లేకుండా ఉండ‌లేక‌పోయింది. వృత్తిప‌ట్ల ఆమె క‌మిట్‌మెంట్‌కు అంతా ఫిదా అయిపోయింది. ద‌క్షిణ భార‌త‌దేశంలో అగ్ర‌హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఇలాంటి డీగ్లామ‌ర‌స్‌- ఛాలెంజింగ్ పాత్ర‌లో స‌హ‌జంగా క‌నిపించ‌డంపై అనుష్క‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.
నిర్మాతల ఆందోళ‌న‌!
భారీ శ‌రీరంతో ఉన్న అనుష్క‌ను చూసిన నిర్మాత‌లు బ‌య‌టికి చెప్ప‌కున్నా..సైజ్ జీరో సినిమా ట్ర‌యిల‌ర్ చూసి లోలోన ఆందోళ‌న చెందార‌ట‌. బాహుబ‌లి-2 చిత్రీక‌ర‌ణ‌ డిసెంబ‌రు నాటికి ప్రారంభ‌మ‌వుతుంది. ఈలోగా తాను పెరిగిన 22 కిలోలు ఎలా త‌గ్గుతుంద‌న్న‌ ప్ర‌శ్న వారి మ‌న‌సును తొలిచేసింద‌ట‌. కానీ, యోగా టీచ‌ర్ అయిన అనుష్క మాత్రం స‌హ‌జ ప‌ద్ధ‌తుల్లో అప్పుడే బ‌రువు త‌గ్గ‌డం స్టార్ట్ చేసింది. ఆరోగ్యం, శ‌రీరత‌త్వంపై పూర్తి అవ‌గాహ‌న ఉన్న అనుష్క ఎలాంటి కృత్రిమ స‌ర్జ‌రీల జోలికి పోకుండా.. స‌హ‌జంగానే బ‌రువు త‌గ్గుతోంద‌ని తెలిసి ఆమె నిర్మాత‌లు ఊపిరి పీల్చుకుంటున్నారని స‌మాచారం. ఒప్పుకున్న‌ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేయాల‌న్న ఆమె త‌ప‌న చూసి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ ముచ్చ‌ట ప‌డుతోంది. ఆల్ ద బెస్ట్ అనుష్క అని అండ‌గా నిలుస్తోంది.
Next Story