Telugu Global
Cinema & Entertainment

తెరపై సూపర్‌స్టార్స్‌..?

ఇద్దరు సూపర్‌స్టార్లు ఒక్క చోట నిలబడితేనే ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారు. మరి ఆ ఇద్దరు సూపర్‌ స్టార్లు తెరపై కనిపిస్తే… ప్రేక్షకుల ఆనందానికి హద్దే ఉండదు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌, కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ “రోబో”, “కొచ్చాడయాన్‌”… లాంటి సినిమాల ప్రొమోషన్స్‌తో పాటు చాలా సార్లు వేదికను పంచుకున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. ఆ మధ్య రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌తో కలిసి “షమితాబ్‌” చిత్రంలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న అమితాబ్‌… ఈసారి ధనుష్‌ మామతో డైలాగులు […]

తెరపై సూపర్‌స్టార్స్‌..?
X
ఇద్దరు సూపర్‌స్టార్లు ఒక్క చోట నిలబడితేనే ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారు. మరి ఆ ఇద్దరు సూపర్‌ స్టార్లు తెరపై కనిపిస్తే… ప్రేక్షకుల ఆనందానికి హద్దే ఉండదు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌, కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ “రోబో”, “కొచ్చాడయాన్‌”… లాంటి సినిమాల ప్రొమోషన్స్‌తో పాటు చాలా సార్లు వేదికను పంచుకున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. ఆ మధ్య రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌తో కలిసి “షమితాబ్‌” చిత్రంలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న అమితాబ్‌… ఈసారి ధనుష్‌ మామతో డైలాగులు చెప్పటానికి రెడీ అవుతున్నాడట. అవును… “రోబో2” చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి బిగ్‌ బీ నటిస్తాడని కోలీవుడ్‌ ఇండస్ట్రీ కోడైకూస్తోంది.
1985లో వచ్చిన “గిరఫ్తార్‌” ఆ తర్వాత వచ్చిన “హమ్‌” చిత్రంలో కలిసి ఈ సూపర్‌స్టార్స్‌ నటించారు. ఆ తర్వాత వాస్తవానికి “రోబో” చిత్రంలోనే వీరిద్దరూ కలిసి నటించాల్సి ఉంది. రోబో క్యారెక్టర్‌ను అమితాబ్‌తో చేయించాలని శంకర్‌ అడిగితే బిగ్‌ బీ కాస్త సంశయించాడట. “ఆ సమయంలో బిగ్‌ బీ బిజీ” అని ఆయన అభిమానులు చెప్పవచ్చు. అయితే మొత్తానికి “రోబో” చిత్రంలో నటించే అవకాశాన్ని వదులుకున్నాడు సీనియర్‌ బచ్చన్‌. ఆ తర్వాత శంకర్‌ తన అభిమాన హీరో రజనీకాంత్‌తో “రోబో” స్వీక్వెల్‌లో కలిసి అమితాబ్‌ నటిస్తే అభిమానులకు పండగే కదు… బాక్సాఫీస్‌లు షేక్‌ అవుతాయనటంలో సందేహం లేదు.
First Published:  4 Nov 2015 7:05 PM GMT
Next Story