Telugu Global
Others

సారిక చివరి ఈ- మెయిల్ సారాంశం ఇదే

తన ముగ్గురు పిల్లలతో పాటు సజీవ దహనానికి గురైన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక చివరి సారిగా తన న్యాయవాదికి పంపిన ఈ మెయిల్ ఇప్పుడు బయటకు వచ్చింది. కేసు విచారణలో ఇది కీలకం కానుందని పోలీసులు చెబుతున్నారు. గత నెలలో తన లాయర్ రెహానాకు తను పడుతున్న నరకయాతనను వివరిస్తూ 22 పేజీల ఈ మెయిల్‌ను సారిక పంపింది. మానసికంగా, శారీరకంగా తను నిత్యం నరకం అనుభవిస్తున్నానని ఈ మెయిల్‌లో వివరించింది సారిక. భర్త […]

సారిక చివరి ఈ- మెయిల్ సారాంశం ఇదే
X

తన ముగ్గురు పిల్లలతో పాటు సజీవ దహనానికి గురైన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక చివరి సారిగా తన న్యాయవాదికి పంపిన ఈ మెయిల్ ఇప్పుడు బయటకు వచ్చింది. కేసు విచారణలో ఇది కీలకం కానుందని పోలీసులు చెబుతున్నారు. గత నెలలో తన లాయర్ రెహానాకు తను పడుతున్న నరకయాతనను వివరిస్తూ 22 పేజీల ఈ మెయిల్‌ను సారిక పంపింది.

మానసికంగా, శారీరకంగా తను నిత్యం నరకం అనుభవిస్తున్నానని ఈ మెయిల్‌లో వివరించింది సారిక. భర్త అనిల్ శారీకంగా హింసిస్తున్నాడని వాపోయింది. తాను, పిల్లలు కనీసం అన్నం తిన్నామా లేదా అన్నది కూడా అడిగే వారు లేకుండా పోయారని లాయర్‌తో చెప్పుకుంది. పిల్లల ఆహారం కోసం తాను చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన చెందింది. కనీసం భోజనానికి అవసరమైన సరుకులు అందించేవారు కూడా లేరంటూ తను అనుభవిస్తున్న బాధను లాయర్‌తో పంచుకుంది. రెండోసారి గర్భం దాల్చిన సమయంలో నరకం అనుభవించానని చెప్పింది. వైద్య పరీక్షలు కూడా చేయించలేదని వివరించింది. వండుకోవడానికి సరుకులు లేక తాను, తన పిల్లలు చాలా సార్లు ఆకలితో అలమటించామని ఈమెయిల్‌లో స్పష్టంగా రాసింది సారిక.

ఇల్లు విడిచి వెళ్లాలని పదే పదే అత్త వేధిస్తోందని తన ఈ మెయిల్‌లో వివరించింది. అత్త అరుపులు, కేకలు, బెదిరింపులు తన జీవితంలో ఒక భాగమైపోయాయని వాపోయింది. తల్లి పంపిన చీరను తీసుకోనివ్వలేదన్నారు. అంతేకాదు తమ కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేయాలంటూ రాజయ్య వేధించారని సారిక మెయిల్‌లో చెప్పింది. రాజయ్య మాటలతో బాధేసేదని జీవితాన్ని ముగించాలన్న ఆలోచన వచ్చేదని తన నిస్సహాయతను వివరించింది.

సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తరపు లాయర్ రెహానా కూడా చెబుతున్నారు. పాత కేసులో రాజయ్య పేరు తొలగింపును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించుకున్నామని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని రెహానా అంటున్నారు. సారికది ముమ్మాటికి హత్యేనని ఆమె అభిప్రాయపడ్డారు.

First Published:  5 Nov 2015 4:11 AM GMT
Next Story