Telugu Global
Cinema & Entertainment

షారుక్ తో  పోటీ ప‌డ‌టం బాధ‌గా ఉందంటున్న దీపిక ల‌వ‌ర్

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కో-స్టార్స్ తో కలసి సందడిగా కనిపించే రణవీర్ సింగ్.. ఇప్పుడు సీరియస్ లుక్‌‌లో యుద్ధానికి సిద్ధమైన వీరయోధుడిలా గంభీరంగా దర్శనమిస్తున్నాడు. అయితే ఇదంతా బాజీరావ్ మస్తానీ సినిమా కోసమే తప్ప.. తానెప్పుడూ ఫన్‌గా ఉండేందుకు ఇష్టపడతానంటున్నాడు రణవీర్ సింగ్. దీపికా పదుకొణేతో కలసి రణవీర్ సింగ్ నటించిన బాజీరావ్ మస్తానీ భారీ హోర్డింగ్‌ను ఇటీవల ముంబైలోని ఓ థియేటర్ వద్ద ఆవిష్కరించాడు రణవీర్ సింగ్. రామ్ లీలా తర్వాత సంజయ్ లీలా భన్సాలి […]

షారుక్ తో  పోటీ ప‌డ‌టం బాధ‌గా ఉందంటున్న దీపిక ల‌వ‌ర్
X

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కో-స్టార్స్ తో కలసి సందడిగా కనిపించే రణవీర్ సింగ్.. ఇప్పుడు సీరియస్ లుక్‌‌లో యుద్ధానికి సిద్ధమైన వీరయోధుడిలా గంభీరంగా దర్శనమిస్తున్నాడు. అయితే ఇదంతా బాజీరావ్ మస్తానీ సినిమా కోసమే తప్ప.. తానెప్పుడూ ఫన్‌గా ఉండేందుకు ఇష్టపడతానంటున్నాడు రణవీర్ సింగ్. దీపికా పదుకొణేతో కలసి రణవీర్ సింగ్ నటించిన బాజీరావ్ మస్తానీ భారీ హోర్డింగ్‌ను ఇటీవల ముంబైలోని ఓ థియేటర్ వద్ద ఆవిష్కరించాడు రణవీర్ సింగ్. రామ్ లీలా తర్వాత సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో బాజీరావు మస్తానీ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్న రణవీర్ సింగ్… షారుఖ్ వంటి స్టార్ హీరోతో పోటీపడబోతుండటం మాత్రం మనసును బాధపెడుతోందన్నాడు.
మరాఠా రాజు బాజీరావ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాజీరావుగా రణవీర్ సింగ్, మస్తానీగా దీపిక నటిస్తోంది. మరో కీలక పాత్రను ప్రియాంక చోప్రా పోషిస్తోంది. దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో కిశోర్ లుల్లాతో కలసి భన్సాలీ సినిమాను నిర్మిస్తున్నాడు. డిసెంబర్-18న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇదే తేదికి షారుఖ్ సినిమా దిల్ వాలే కూడా వస్తుండడటంతో.. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ రెండు సినిమాల మధ్యే భారీ పోటీ నెలకొంది. ఈ విషయంపైనే రణవీర్ సింగ్.. షారుఖ్ తో పోటీపడటంపై నెర్వస్ ఫీలయ్యాడు. ఇక తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ఇలా రెండు సినిమాలూ ఒకే తేదీకి విడుదల చేయడం తామిద్దరికీ మంచిది కాదని.. అయినప్పటికీ రెండు సినిమాలు విజయం సాధిస్తాయనే నమ్మకముందన్నాడు షారుఖ్. సో.. ఇటు షారుఖ్ అటు రణవీర్ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా పోటీపడుతున్నామంటున్నారు. రెంటిలో క‌థ ప‌రంగా ఏది బ‌లంగా వుంటే అదే విజ‌యం సాధిస్తుంది అంటున్నారు ప‌రిశీల‌కులు.

First Published:  4 Nov 2015 7:07 PM GMT
Next Story